Begin typing your search above and press return to search.

భార్య విడాకుల‌పై కంట త‌డి పెట్టిన డైరెక్ట‌ర్ కం బిగ్ బాస్ స‌భ్యుడు!

By:  Tupaki Desk   |   18 Sep 2020 12:30 AM GMT
భార్య విడాకుల‌పై కంట త‌డి పెట్టిన డైరెక్ట‌ర్ కం బిగ్ బాస్ స‌భ్యుడు!
X
సుమంత్ హీరోగా న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `స‌త్యం`ని ఎవ‌రూ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. స‌రైన టైమ్ లో స‌రైన హిట్టు కొట్టాడు అక్కినేని కాంపౌండ్ హీరో. అయితే ఆ త‌ర్వాత అత‌డి కెరీర్ సంగ‌తి ఎలా ఉన్నా ఆ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సూర్య కిర‌ణ్ పేరు మాత్రం మార్మోగింది. ఒక చ‌క్క‌ని క్లాసిక్ తీసిన ద‌ర్శ‌కుడిగా అత‌డికి ఐడెంటిటీ ద‌క్కింది. ఆ త‌ర్వాత టాలీవుడ్ లో వ‌రుస‌గా సినిమాలు తీసారు.

అయితే అనూహ్యంగా ఆయ‌న జీవితంలో ఓ రెండు ప‌రిణామాలు తీవ్రంగా న‌ష్ట‌పోయేలా చేశాయి. ఇటీవ‌ల తెలుగు `బిగ్ బాస్ సీజ‌న్ 4` నుంచి తొలిగా ఎలిమినేట్ అయ్యారు సూర్య‌కిర‌ణ్. ఈ సంద‌ర్భంగా మీడియా ఇంట‌ర్వ్యూల్లో మాట్లాడుతూ.. ``10 కోట్లు పెట్టి ఇండ‌స్ట్రీలో తీవ్రంగా న‌ష్ట‌పోయాను``ని తెలిపారు. ఆ న‌ష్టం వ‌ల్ల‌నే తాను త్వ‌ర‌గా కోలుకోలేక‌పోయాన‌ని అన్నారు.

ఇక అందాల క‌థానాయిక క‌ళ్యాణిని పెళ్లాడినా కొన్నేళ్ల‌కు విడాకులు తీసుకోవ‌డం త‌న‌ను బాగా బాధించింది. ``అమ్మ ఇద్ద‌రు చెల్లెళ్ల త‌ర్వాత క‌ళ్యాణి అని అనుకునేవాడిని. కానీ త‌ను నా నుంచి విడిపోయింది`` అంటూ కంట త‌డి పెట్టుకున్నారు సూర్య‌కిర‌ణ్. ``క‌ళ్యాణి అంత అందంగా ఇంకెవ‌రూ అనిపించ‌లేదు. త‌న‌కు నేనంటే ఇష్టం లేదు. త‌నంటే నాకు ఎప్పుడూ ఇష్ట‌మే`` అంటూ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. భార్య‌కు విడాకులిచ్చ‌నా ఇంకా త‌న ఫోటోనే ఫోన్ ప్రొఫైల్ లో పెట్టుకుని ఉంటే త‌న త‌ల్లి తిట్టార‌ని కూడా చెప్ప‌డం చూస్తుంటే క‌ళ్యాణిపై ఆయ‌న ప్రేమ ఎంతో ఆర్థం చేసుకోవ‌చ్చు. ఆయ‌న‌లా యూట్యూబ్ చానెల్ ఇంట‌ర్వ్యూ లో కంట త‌డి పెట్ట‌డం అభిమానుల్ని క‌ల‌చివేసింది కూడా.