Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 4: ఫస్ట్ ఎలిమినేషన్ - వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరంటే...?

By:  Tupaki Desk   |   13 Sep 2020 1:30 PM GMT
బిగ్ బాస్ 4: ఫస్ట్ ఎలిమినేషన్ - వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరంటే...?
X
బుల్లితెర సెన్సేషన్‌ రియాలిటీ షో బిగ్‌ బాస్ తెలుగు సీజ‌న్ - 4 మొద‌టి వారం ఎలిమినేష‌న్ ఇవాళ జరగనుంది. ఎలిమినేష‌న్ జోన్‌ లో ఉన్న ఏడుగురిలో హోస్ట్ 'కింగ్' నాగార్జున ఇప్ప‌టికే గంగ‌వ్వ‌ - అభిజిత్‌ - సుజాత‌ లను సేవ్ చేశారు. మెహ‌బూబ్‌ - అఖిల్‌ - దివి - సూర్య కిరణ్‌ ఇంకా డేంజ‌ర్ జోన్‌ లోనే ఉన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు అందిన సమాచారం ప్రకారం ఫస్ట్ ఎలిమినేషన్ గా డైరెక్టర్ సూర్య కిరణ్ బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈరోజు ఒక కొత్త కంటెస్టెంట్ హౌజ్‌ లోకి వైల్డ్‌ కార్డుతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ 4 నిర్వాహకులైన స్టార్‌ మా విడుదల చేసింది.

లేటెస్ట్ ప్రోమోలో ఎలిమినేష‌న్ వ‌ద్దంటూ కంటెస్టెంట్స్ అందరూ ర్యాప్ సాంగ్‌ తో నాగార్జున‌ను రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కానీ బిగ్‌ బాస్ సీత‌య్య అని.. ఎవ‌రిమాటా విన‌డ‌ని వారి విన‌తిని నాగార్జున తిర‌స్క‌రించారు. దీంతో డేంజ‌ర్ జోన్‌ లో ఉన్న కంటెస్టెంట్లు డల్ అయ్యారు. అయితే ఈ రోజు ఎపిసోడ్ లో ఓ స‌ర్‌ ప్రైజ్ ఉండ‌బోతోందని నాగ్‌ పేర్కొన్నారు. కాగా బిగ్ బాస్ సీజ‌న్ - 4 స్టార్ట్ అయి వారం గడిచినా సందడి లేదని.. ఏదో డబ్బింగ్ సినిమాని టీవీలో చూస్తున్నట్లుందని కామెంట్స్ వస్తున్నాయి. ఎప్పుడూ వినిపించే ఏడుపులు ఈసారి మరీ ఎక్కువగా ఉండటంతో కొత్తదనం కోరుకునే వీక్షకులు ఎంజాయ్ చెయ్యలేకపోతున్నారని తెలుస్తోంది. అందుకే బిగ్‌ బాస్ నిర్వాహ‌కులు మొదటి వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీని పంపిచారు. అయితే ఆ కంటెస్టెంటు కమెడియన్ సాయి కుమార్ పంప‌న అని స‌మాచారం. 'ఈరోజుల్లో' 'బస్టాప్' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సాయి కుమార్ బిగ్‌ బాస్‌ లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపించగా.. తాజాగా అతడు హౌజ్‌ లోకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.