Begin typing your search above and press return to search.

'సూర్య40': గన్ పట్టుకుని సెట్స్ లో అడుగుపెట్టిన సూర్య

By:  Tupaki Desk   |   18 March 2021 7:23 PM IST
సూర్య40: గన్ పట్టుకుని సెట్స్ లో అడుగుపెట్టిన సూర్య
X
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్న స్టార్ హీరో సూర్య.. గతేడాది 'ఆకాశం నీ హ‌ద్దురా' సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలో పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 40వ సినిమాను ప్రారంభించారు సూర్య. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ పై ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ప్రియాంక అరుల్ మోహ‌న్ హీరోయిన్ గా నటించనుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. కరోనా బారిన పడిన హీరో సూర్య.. ప్రారంభోత్స‌వానికి హాజరు కాలేదు. అయితే తాజాగా షూటింగ్ లో జాయిన్ అయినట్లు సూర్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా 'సూర్య40' నుంచి గన్ పట్టుకుని ఉన్న సూర్య పోస్టర్ ని అభిమానులతో పంచుకున్నారు.

'సూర్య40' సినిమా సామాజిక అంశాలతో రూపొందే మాస్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. రూరల్ మరియు అర్బన్ ఫ్లేవర్ లో ఈ సినిమా ఉండబోతోంది. ఈ చిత్రంలో స‌త్య‌రాజ్‌ - జయప్రకాశ్ - శరణ్య పొన్వన్నన్ - సుబ్బు పంచు - దేవదర్శిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం సమకూరుసస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌ గా వ్యవహరిస్తున్నారు. జాకీ ఆర్ట్ డైరెక్టర్‌ గా పని చేస్తుండగా.. ఫైట్ మాస్టర్స్ అన్బు - అరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. గతంలో సూర్య - పాండిరాజ్‌ కాంబినేషన్‌ లో ‘పసంగ 2’(మేము) సినిమా వచ్చింది. మరోసారి ఈ కలయికలో వస్తున్న 'సూర్య40' పై మంచి అంచనాలు ఉన్నాయి.