Begin typing your search above and press return to search.
కెమెరా వెనుక హీరోయిన్స్ కష్టం చాలా ఉంటుంది
By: Tupaki Desk | 14 Jun 2019 10:05 AM GMTటాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల 'దే దే ప్యార్ దే' మరియు 'ఎన్జీకే' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ లో చేసిన దే దే ప్యార్ దే చిత్రం రకుల్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ చిత్రంలో నటన మరియు గ్లామర్ తో రకుల్ ఆకట్టుకుంది. ఇక ఎన్జీకే చిత్రంలో కూడా రకుల్ కు మంచి పాత్ర పడ్డా సినిమా ఫలితం తేడా కొట్టడంతో రకుల్ కు నిరాశే మిగిలింది. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ హీరోయిన్స్ పడే కష్టాల గురించి చెప్పుకొచ్చింది.
రకుల్ మాట్లాడుతూ.. హీరోయిన్స్ స్క్రీన్ పై చాలా సాఫ్ట్ గా.. కూల్ గా కనిపిస్తూ ఉంటారు. కాని కెమెరా వెనుక వారు పడే కష్టం చాలా ఉంటుంది. కెమెరా ముందుకు వచ్చిన సమయంలో అందంగా కనిపించేందుకు కెమెరా వెనుక ఉన్న సమయంలో ఎంతగా కష్టపడతామో మాకు మాత్రమే తెలుసు. అందంగా ఉండటం కోసం డైటింగ్ ఫాలో అవ్వడంతో పాటు ప్రతి రోజు గంటలకు గంటలు జిమ్ లో వర్కౌట్ చేయాల్సి ఉంటుందని రకుల్ పేర్కొంది.
కెమెరా వెనుక తాము ఎంత ఎక్కువగా కష్టపడితే కెమెరా ముందు తాము అంత అందంగా కనిపిస్తామని రకుల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె తమిళంలో ఒక చిత్రంలో నటించడంతో పాటు తెలుగులో నాగార్జునకు జోడీగా 'మన్మధుడు 2' చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది. మరో వైపు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఈమెతో టచ్ లో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.