Begin typing your search above and press return to search.

వాట్.. ఆ నటికీ రెండేళ్ల క్రితమే పెళ్లైందా?

By:  Tupaki Desk   |   27 Dec 2017 4:17 PM GMT
వాట్.. ఆ నటికీ రెండేళ్ల క్రితమే పెళ్లైందా?
X
సినిమా ఇండస్ట్రీలో కొంత మంది తారలు వారి సినిమా కథలు రిలీజ్ డేట్ వరకు ఎలా లీక్ చేయకుండా ఉంటారో అలాగే ప్రేమ వ్యవహారాలను కూడా సీక్రెట్ గా మెయింటేన్ చేస్తుంటారు. ఆఖరికి పెళ్లి జరిగిందని కూడా చెప్పారు. రెండు మూడేళ్ల తరువాత అందుకు సంబందించిన ఎదో ఒక న్యూస్ వైరల్ అయితే ఇప్పుడు అందరు ఆశ్చర్య పోతారు గాని తారలు మాత్రం క్లారిటీ ఇవ్వరు. అలాంటి తారలు చాలా మందే ఉన్నారు.

గతాన్ని గురించి పక్కనపెట్టి లేటెస్ట్ గా వెలువడిన ఒక రూమర్ గురించి వింటే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని సిల్వర్స్ స్క్రీన్స్ లో కనిపించిన ఒక బ్యూటీ పెళ్లి రెండేళ్ల క్రితమే సింపుల్ గా బయటి దేశంలో జరిగిపోయిందట. ఆమె ఎవరో కాదు. సుర్వీన్ చావ్లా. తెలుగులో అమ్మడు శర్వానంద్ నటించిన రాజు మహారాజు అనే సినిమాలో కనిపించింది. ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఈ బ్యూటీ కోలీవుడ్ బాలీవుడ్ లో కొన్ని సైడ్ క్యారెక్టర్స్ ని అందుకుంది.

ఇక బాలీవుడ్ లో అయితే అజయ్ దేవగన్ నటించిన పర్చేడ్ సినిమాలో కూడా ఒక కీలక పాత్ర పోషించడంతో స్పెషల్ సాంగ్స్ లో చిందులేసే అవకాశాలు చాలానే వచ్చాయి. అయితే అమ్మడు అక్షయ్ థక్కర్ అనే ఒక బిజినెస్ మెన్ ని ఇటలీ లో సైలెంట్ గా పెళ్లి చేసుకుందట. 2015 లో జులై 28న ఒక చర్చ్ లో సాంప్రదాయ బద్దంగా వివాహం చేసుకున్నారని తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న చాలామంది ఆశ్చర్యపోతున్నారు. సుర్వీన్ అప్పుడే పెళ్లి చేసుకుండా అని సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో జరిగిపోయిన పెళ్లి గురించి సుర్వీన్ అధికారికంగా తెలుపనుందని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.