Begin typing your search above and press return to search.

కాస్టింగ్ కౌచ్ లో జాతీయ అవార్డ్ డైరెక్ట‌ర్..?!

By:  Tupaki Desk   |   26 Jun 2021 7:00 PM IST
కాస్టింగ్ కౌచ్ లో జాతీయ అవార్డ్ డైరెక్ట‌ర్..?!
X
కాస్టింగ్ కౌచ్ ర‌హ‌స్యాల్ని బ‌హిర్గ‌తం చేసేందుకు ప్రారంభ‌మైన # మీటూ ఉద్య‌మం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో రంగాల్ని కుదిపేసిన సంగ‌తి తెలిసిందే. సినీరంగంలో ఎంద‌రో స్టార్లు ఈ వేదిక పై త‌మ స‌మ‌స్య‌ల్ని బ‌హిర్గ‌తం చేశారు. అన్ని భాష‌ల న‌టులు.. అన్ని రంగాల మ‌హిళ‌లు త‌మ‌కెదురైన చేదు అనుభ‌వాల్ని చెప్పుకుని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. బాధిత మ‌హిళ‌లు ఒక్కొక్క‌రుగా ముందుకొచ్చి లైంగికంగా ఎలాంటి వేధింపుల‌కు గుర‌య్యార‌న్న‌ది ధైర్యంగా వెల్ల‌డించారు. ముఖ్యంగా అన్ని భాష‌ల సినీ ప‌రిశ్ర‌మ న‌టీమ‌ణులు ఎంత‌గా క్షోభ‌కు గుర‌య్యార‌న్న‌ది వీడియోల రూపంలో రివీల్ చేసి వాపోయారు. అవ‌కాశం చిక్కిన ఏ వేదిక‌ను వ‌దిలిపెట్ట‌లేదు.

త‌మ గ‌ళాన్ని పెద్ద ఎత్తున వినిపించారు. అప్ప‌టి నుంచి ప‌రిశ్ర‌మ‌ల్లో లైంగిక వేధింపులు కాస్త త‌గ్గు ముఖం ప‌ట్టిన‌ట్లే క‌నిపిస్తోంది. అయితే తాజాగా ఉత్త‌రాది హీరోయిన్ సుర్విన్ చావ్లా కూడా లైంగిక వేధింపుల‌కు గురైన‌ట్లు వెల్ల‌డించింది. మూడు సార్లు ద‌క్షిణాదిన‌.. రెండుసార్లు ఉత్త‌రాది ప‌రిశ్ర‌మ‌ల్లో కాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొన్న‌ట్లు తెలిపింది. జాతీయ అవార్డు ద‌క్కించుకున్న ఓ సౌత్ డైరెక్ట‌ర్ ఆడిష‌న్ కి పిలిపించి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు తెలిపింది.

దీంతో ఆ సినిమా వ‌దులుకోవాల‌ని డిసైడ్ అయినా ఆ ద‌ర్శ‌కుడు మాత్రం త‌న‌ని వ‌దిలిపెట్ట‌కుండా వెంటాడార‌ని తెలిపింది. మ‌రో ఇద్ద‌రు హిందీ ద‌ర్శ‌కుల్లో ఒక‌రు క్లీవేజ్ చూపించ‌మ‌ని ప‌ట్టుబ‌ట్టాడ‌ని...కానీ అందుకు తాను అంగీక‌రించ‌లేద‌ని తెలిపింది. సుర్విన్ తెలుగు- త‌మిళ‌- క‌న్నడ భాష‌ల చిత్రాల్లో న‌టించింది. క‌న్న‌డ సినిమాతో కెరీర్ ప్రారంభించిన అమ్మ‌డు తెలుగులో `రాజు మ‌హారాజు` అనే సినిమాలో న‌టించింది.