Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ `వ‌కీల్‌ సాబ్‌` నుంచి స‌ర్‌ ప్రైజ్ రెడీ!

By:  Tupaki Desk   |   21 Oct 2020 3:40 PM IST
ప‌వ‌న్ `వ‌కీల్‌ సాబ్‌` నుంచి స‌ర్‌ ప్రైజ్ రెడీ!
X
ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ కొంత విరామం త‌రువాత న‌టిస్తున్న చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ చిత్రాన్ని దిల్ రాజుతో క‌లిసి బోనీ క‌పూర్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవ షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.

ఇటీవ‌లే చివ‌రి షెడ్యూల్‌ ని చిత్ర బృందం ప్రారంభించింది. ప‌వ‌న్ మాత్రం ఇంకా సెట్‌ లో అడుగుపెట్ట‌లేదు. వ‌చ్చే నెల నుంచి ప‌వ‌న్ ఎంట‌ర్ కాబోతున్నారు. మంత్ ఎండింగ్ వ‌ర‌కు షూట్ కొన‌సాగ‌నుంది. అంజ‌లి, .. నివేదా థామ‌స్.., ప్ర‌కాష్‌రాజ్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప‌వ‌న్ ‌కు జోడీగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ‌లో శృతిహాస‌న్ న‌టించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీకి సంబంధించిన లిరిక‌ల్ సాంగ్‌ ని తో పాటు ఫ‌స్ట్ లుక్‌ ని మాత్ర‌మే రిలీజ్ చేశారు. టీజ‌ర్ మాత్రం ఇంత వ‌ర‌కు రాలేదు. దీని కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. టీమ్ కూడా టీజ‌ర్ రిలీజ్ చేసే ప్ర‌య‌త్నాల్లో వున్న‌ట్టు తెలిసింది. కీల‌క షాట్‌ ల‌తో టీజ‌ర్ ‌ని అదిరిపోయే రేంజ్‌ లో సిద్ధం చేస్తున్నార‌ట‌. థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం అందిసంతున్నాడు. అయితే దీన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తార‌న్న‌ది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ అయోమ‌యంలో వున్నార‌ట‌.