Begin typing your search above and press return to search.

Suriya42 మోషన్ పోస్టర్: వారియర్ గా మారిన సూర్య..!

By:  Tupaki Desk   |   9 Sep 2022 5:14 AM GMT
Suriya42 మోషన్ పోస్టర్: వారియర్ గా మారిన సూర్య..!
X
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న సూర్య.. ఇటీవలే తన కెరీర్ లో 42వ చిత్రాన్ని ప్రారంభించారు.

మాస్ డైరెక్ట‌ర్ సిరుతై శివ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య హీరోగా #Suriya42 మూవీ తెరకెక్కుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మరియు స్టూడియో గ్రీన్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. వంశీ - ప్రమోద్ మరియు కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

రీసెంట్‌ గా చెన్నైలో ఈ ప్రెస్టీజియస్ మెగా ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌ గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు (సెప్టెంబర్ 9) శుక్రవారం మేకర్స్ సూర్య అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా #Suriya42 నుంచి మోషన్ పోస్టర్ ని ఆవిష్కరించారు.

యుద్ధ భూమిలో మంటలు చెలరేగుతుండగా.. ఓ గద్ద ఆకాశంలో విహరిస్తూ సూర్య భుజం మీద వాలడంతో అతని బ్యాక్ సైడ్ లుక్ ని రివీల్ చేశారు. ఇందులో చేతిలో ఆయుధాలతో సూర్య ని ఒక వారియర్ గా ప్రెజెంట్ చేశారు. ఇదొక శక్తివంతమైన పరాక్రమవంతుడి సాగా అని మేకర్స్ పేర్కొన్నారు.

ఇప్పటి వరకూ ఇది డైరెక్టర్ శివ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనుకుంటుండగా.. #Suriya42 మోషన్ పోస్టర్ తో చారిత్రక నేపథ్యంలో భారీ బడ్జెట్ తో విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కించే సినిమా అని అర్థమవుతోంది. దీనికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ సమకూర్చిన బీజీఎం అద్భుతంగా ఉంది.

అంతేకాదు ఈ చిత్రాన్ని 3డీ లో రూపొందిస్తున్నామని.. 10 ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది సూర్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందే సినిమా అని తెలుస్తుంది. సూర్యను ఇంతకుముందు చూడని సరికొత్త పాత్రలో శివ ప్రెజెంట్ చేస్తున్నాడని అర్థమవుతోంది.

సూర్య42 సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీ హీరోయిన్ గా నటిస్తోంది. వెట్రి ఫలనిస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మిలాన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. చెన్నై మరియు గోవా లలో ఈ సినిమా కోసం భారీ సెట్లు వేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.