Begin typing your search above and press return to search.

సింగం గ‌ర్జ‌న య‌ధావిధిగా..

By:  Tupaki Desk   |   23 Nov 2016 3:55 AM GMT
సింగం గ‌ర్జ‌న య‌ధావిధిగా..
X
అల్లు అర‌వింద్ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఆయ‌న నిర్మాణంలో తెర‌కెక్కిన ‘ధృవ‌’కు ‘సింగం’ పోటు త‌ప్ప‌ట్లేదు. ‘ధృవ’ వ‌చ్చిన వారానికే సూర్య మూవీ ‘ఎస్‌-3’ థియేట‌ర్ల‌లోకి దిగిపోతోంది. నిన్న‌టి దాకా ఈ సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో నెల‌కొన్న సందిగ్ధ‌త‌కు తెర‌ప‌డింది. డిసెంబ‌రు 16నే ‘ఎస్‌-3’ రిలీజ్ అని నిర్మాత జ్నాన‌వేల్ రాజా ప్ర‌క‌టించాడు. తెలుగు-త‌మిళ భాష‌ల్లో ఒకేసారి ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

‘ఎస్‌-3’ మీద తెలుగులోనూ భారీ అంచ‌నాలుండ‌టం.. పైగా మాస్ ఆడియ‌న్స్ ఈ సినిమాపై చాలా ఆస‌క్తితో ఉండ‌టంతో ధృవ వ‌చ్చిన వారానికే ఈ సినిమా వ‌స్తే ఇబ్బంద‌ని అల్లు అర‌వింద్ భావించాడు. త‌న‌కు స‌న్నిహితుడైన జ్నాన‌వేల్ రాజాతో సంప్ర‌దింపులు జ‌రిపాడ‌ని.. సినిమాను వాయిదా వేయించ‌డానికి గ‌ట్టి ప్ర‌య‌త్నమే చేస్తున్నాడ‌ని వార్త‌లొచ్చాయి. ఐతే క్రిస్మ‌స్ వీకెండ్లో ఇటు తెలుగులో.. అటు తమిళంలో చాలా సినిమాలు షెడ్యూల్ అయి ఉన్న నేపథ్యంలో ‘ఎస్-3’ని వాయిదా వేయడానికి కుద‌ర్లేదు. దీంతో సూర్య అండ్ టీమ్ య‌ధావిధిగా 16నే ‘ఎస్‌-3’ రిలీజ్ అని ప్ర‌క‌టించేసింది.

‘సింగం సిరీస్ లో ఇంత‌కుముందు వ‌చ్చిన రెండు సినిమాలకు మాస్ ఆడియ‌న్స్ నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ‘ఎస్‌-3’ మీద కూడా ఆ వ‌ర్గం ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ‘ధృవ‌’కు పంచ్ ప‌డుతుందేమో అన్న‌ది అర‌వింద్ ఆందోళ‌న‌. హ‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ‘ఎస్‌-3’లో సూర్య స‌ర‌స‌న శ్రుతి హాస‌న్.. అనుష్క క‌థానాయిక‌లుగా న‌టించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/