Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ కి పోటీ ఇస్తున్న సింగం

By:  Tupaki Desk   |   10 Nov 2016 10:26 PM GMT
సూపర్ స్టార్ కి పోటీ ఇస్తున్న సింగం
X
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సింగం సీక్వెల్ రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. దీపావళికే ఈ మూవీ థియేటర్లలో ఉండాల్సింది కానీ.. అప్పట్లో తమ్ముడు కార్తీ నటించిన కాష్మోరా కోసం ఆ పండగను వదిలేసుకుని.. క్రిస్మస్ ను టార్గెట్ చేశాడు సూర్య. ఎస్3 మూవీపై జనాల్లో ఎంత ఆసక్తి ఉందో.. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు.. యూట్యూబ్ లో వస్తున్న వ్యూస్ చూస్తే అర్ధమవుతుంది.

ఈ ఏడాది ఫుల్ స్పీడ్ గా యూట్యూబ్ వ్యూస్ సాధించిన మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి మాత్రమే. ఆ తర్వాత 3 మిలియన్ల వ్యూస్ ను అత్యధిక వేగంగా అందుకుని రికార్డుని.. ఎస్3తో సూర్య సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడీ టీజర్ కి 40 లక్షల వ్యూస్ దాటిపోయి.. కొత్త రికార్డుల వైపు వేగంగా పరుగెడుతోంది. కోలీవుడ్ లో అభిమానుల మధ్య ఈ వ్యూస్ కోసం పెద్ద పోటీనే ఉంటుంది కానీ.. సింగం సీక్వెల్ విషయంలో ఇతర భాషల్లోనూ ఈ ఆసక్తి కనిపిస్తోంది. సింగం3తో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ తన వసూళ్లు సత్తా నిరూపించుకునేందుకు సూర్య సిద్ధమైపోతున్నాడు.

24 లాంటి క్లాస్ మూవీతోనే థియేటర్లను నింపగల సత్తా ఉన్న హీరో. అలాంటిది సింగం లాంటి మాస్ మసాలా ఎంటర్టెయినర్.. అందులోనూ మొదటి రెండు భాగాలు సూపర్ హిట్ గా నిలిచిన సిరీస్ తో సక్సెస్ కొట్టడమే కాదు.. రికార్డులు బద్దలు కొట్టేస్తాడని అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టేసుకున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/