Begin typing your search above and press return to search.

ఆ హీరో తన లైఫ్ రిస్క్ లో పెడుతున్నాడా?

By:  Tupaki Desk   |   8 May 2020 5:00 AM IST
ఆ హీరో తన లైఫ్ రిస్క్ లో పెడుతున్నాడా?
X
దేశంలో కరోనా కారణంగా థియేటర్లు మూతబడి చాలా కాలం అయింది. కరోనా వైరస్ ప్రభావం తగ్గాలంటే.. అన్నీ కుదురుకుని పరిస్థితులు చక్కబడాలంటే కొన్ని నెలల సమయం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఈ విషయం గ్రహించే చిన్న సినిమాల నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇదివరకే విడుదలకు సిద్దమైన సినిమాలను డిజిటల్ మీడియం ద్వారా విడుదల చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన 'పొన్ మగల్ వందాల్' అనే తమిళ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి తమిళ థియేటర్ల సంఘాలు సూర్య పై పైర్ అవుతున్నాయి. నేరుగా థియేటర్లలో విడుదల చేయడానికి రెడీ చేసిన సినిమాలను ఓటీటీలో ఎలా విడుదల చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

థియేటర్లు తెరుచుకునే వరకూ విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయకూడదని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ వారి మాట కాదని రిలీజ్ చేస్తే సూర్య హీరోగా చేసే సినిమాలన్నింటి పై నిషేధం విధిస్తామని హెచ్చరిస్తున్నారట. సూర్య సినిమాలే కాకుండా, నిర్మాతగా వ్యవహరించే సినిమాలు థియేటర్లలో ఆడకుండా చేస్తామని అంటున్నారట. అయితే ప్రస్తుతం సూర్య థియేటర్ సంఘాల హెచ్చరికలను అసలు ఖాతరు చేయడం లేదట. ఈ వార్తలకు బలం చేకూరే విధంగా సూర్య కూడా అలానే ప్రవర్తిస్తున్నాడని వినికిడి. మీరేం చేసుకున్నా నేనేది చేయాలో అదే చేస్తా.. అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడట. తన నిర్ణయాన్ని మానుకోవాలని సంఘాలు ఎంత ఒత్తిడి తెచ్చినా మరి సూర్య ఏ ధైర్యంతో ఇలా చేస్తున్నాడో.. అని సినీ వర్గాలు తలలు బాదుకుంటున్నాయి. ఇకనైనా మొండి వైఖరి మానుకుంటే మంచిదని చెప్తున్నారట. కానీ సూర్య ఏం చేయనున్నాడోనని.. ఇకనైనా నిర్ణయం మార్చుకుంటాడా లేక రిస్క్ తీసుకుంటాడా అనేది పెద్ద ప్రశ్న.