Begin typing your search above and press return to search.
అందం కోసం సర్జరీలు.. హీరోయిన్ల పాట్లేమిటో
By: Tupaki Desk | 16 April 2021 6:00 AM ISTగ్లామర్ పరిశ్రమలో అందం ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన పనే లేదు. మారే ట్రెండ్ ని బట్టి కాంపిటీషన్ లో దూసుకెళ్లేందుకు ఇంకా అందం పెంచుకోవాల్సిన సన్నివేశం ఎదురవుతుంటుంది ఈ పోటీ పరిశ్రమలో. ఇక చాలామంది అందగత్తెలు తమ ముఖారవిందాల్లో చిన్నపాటి లోపాల్ని సవరించుకుని మరింత అందంగా మారేందుకు ఎన్నో సాహసాలు చేసిన వారున్నారు.
నాటి రోజుల్లో మేటి కథానాయిక శ్రీదేవి తన అందం పెంచుకునేందుకు ముక్కు భాగంలో శస్త్ర చికిత్సతో సరి చేయించుకున్నారని ప్రచారమైంది. వెటరన్స్ లో చాలా మంది నాయికల పేర్లు వినిపించాయి. గ్లోబల్ స్టార్ .. మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా కి నాశికా కుహరంలో ఆపరేషన్ జరిగింది. కత్రిన.. అయేషా టకియా.. శ్రుతిహాసన్ సహా చాలా మంది కథానాయికలు తమ అందాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు సర్జరీలు చేయించుకున్నారు. ఇక ఆర్తి అగర్వాల్ అధికబరువు తగ్గేందుకు సర్జరీ చేయించుకోవడం వికటించిన సంగతి తెలిసిందే.
అదంతా అటుంచితే టాలీవుడ్ కోలీవుడ్ సహా హిందీలో ఇప్పటికే అగ్ర కథానాయికగా కొనసాగుతున్న ఒక బ్యూటీ తన అందాన్ని మరింత మెరుగు పరుచుకునేందుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల సదరు నటి హిందీలో వరుస చిత్రాల్లో నటిస్తోంది. కెరీర్ దూకుడుగానే ఉంది. అందంలో బెటర్ మెంట్ వృత్తిపరంగా మరింతగా సహాయపడుతుందని ఎవరైనా సలహా ఇచ్చారో ఏమో కానీ తాను ఈ నిర్ణయం తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేవలం ఆ స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు.. పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమ అందాల్ని మెరుగు పరుచుకునేందుకు కాస్మోటిక్ చికిత్సలు చేయించుకోవడం పై గుసగుసలు వినిపిస్తున్నాయి. టీవీ ఇండస్ట్రీ నటీమణుల్లోనూ ఈ కేటగిరీ అంతకంతకు పెరుగుతోందట. అందం పెంపొందించుకనే శస్త్ర చికిత్సలు తమ ముంగిటకు దగ్గరలోని నగరాల్లోనే అందుబాటులోకి రావడంతో ఎవరూ వెనకాడడం లేదు.
ఇక కొందరికి శస్త్ర చికిత్సలు ఫలవంతం కావు. వికటిస్తే ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి. అందుకే ఈ రిస్క్ శరీరతత్వాన్ని బట్టి కొందరు తీసుకోకూడని చెబుతారు. అయితే ఎవరు ఏం చేసినా ఆడియెన్ కి అందంగా కనిపించాలని అందరినీ మెప్పించాలనే ఆరాటం మాత్రమే ఇది. అందం పెంచుకునేందుకు చాలా వ్యయప్రయాసలకు ఓర్చాల్సి ఉంటుంది. ఇటీవల స్వీటీ అనుష్క బరువు తగ్గి స్లిమ్ లుక్ కి మారేందుకు ఎంతగా రిస్క్ తీసుకుంటున్నారో చూస్తున్నదే. నాయికల ప్రయత్నాల్ని చూస్తే.. మరీ ఇంతగా కష్టపడాలా.. అంతగా ధనం వెచ్చించాలా? అన్నది ఎప్పుడూ అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.