Begin typing your search above and press return to search.

మ్యూజిక్ ఇండస్ట్రీలోకి సురేష్ ప్రొడక్షన్స్.. 'SP మ్యూజిక్' పేరుతో కొత్త లేబుల్..!

By:  Tupaki Desk   |   24 Jun 2021 6:30 AM GMT
మ్యూజిక్ ఇండస్ట్రీలోకి సురేష్ ప్రొడక్షన్స్.. SP మ్యూజిక్ పేరుతో కొత్త లేబుల్..!
X
భారతీయ సినీ పరిశ్రమలోని భారీ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఐదు దశాబ్దాలుగా పలు ప్రాంతీయ భాషల్లో సినిమాలు నిర్మిస్తూ.. ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఎంతో మంది నటీనటులు - దర్శక రచయితలు - సాంకేతిక నిపుణులు ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మూవీ మొఘల్ డి. రామానాయుడు స్థాపించిన ఈ సంస్థ బాధ్యతలు ప్రస్తుతం ఆయన తనయుడు దగ్గుబాటి సురేష్ బాబు - మనవడు రానా చూసుకుంటున్నారు. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ వారు సినిమాల నిర్మాణమే కాకుండా కాక తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. అలానే రామానాయుడు ఫిల్మ్ స్కూల్ ఏర్పాటు చేసి యంగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తోంది.

తాజాగా 'సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్' అనే లేబుల్‌ తో సంగీత పరిశ్రమలోకి అడుగుపెడుతున్నట్లు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. ''50 ఏళ్లుగా సినిమా వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్న సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పుడు 'సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్' అనే మ్యూజిక్ లేబుల్‌ ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. మ్యూజిక్ అనేది మన సినిమాలకు హృదయం లాంటిది. అందుకే దాన్ని సొంతగా జరుపుకోవలసిన అవసరాన్ని మేము గుర్తించాము. 'SP మ్యూజిక్' మంచి సంగీతాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక వేదికగా ఉపయోగపడాలని.. సంగీత శక్తి కేంద్రంగా మారడం లక్ష్యంగా పెట్టుకుంది'' అని నిర్మాణ సంస్థ ప్రకటనలో పేర్కొంది.

నిజానికి సురేష్ ప్రొడక్షన్స్ వారు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లాంచ్ చేస్తారని అందరూ భావించారు. అలాంటి సమయంలో ఇప్పుడు మ్యూజిక్ లేబుల్‌ తో ముందుకు రావడం విశేషం. టాలీవుడ్ లో ఇప్పటికే అనేక మ్యూజిక్ లేబుల్స్ యాక్టీవ్ గా ఉన్నాయి. మరి కొత్తగా వస్తున్న 'SP మ్యూజిక్' లేబుల్.. వాటికంటే ప్రత్యేకమని చాటుకుంటుందేమో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ''నారప్ప'' విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే 'విరాటపర్వం' 'దృశ్యం 2' రీమేక్ సినిమాలు కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.