Begin typing your search above and press return to search.
క్రేజీ ఐడియాతో ముందుకొచ్చిన సురేష్ బాబు
By: Tupaki Desk | 27 April 2020 12:20 PM ISTథియేటర్ల పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. లాక్ డౌన్ విరమణ తర్వాత థియేటర్లు రీ ఓపెన్ అయితే మునుపటిలా ప్రేక్షకులు ఎగబడరు అనేది మాత్రం వాస్తవం. అయితే ఎంత మేరకు బిజినెస్ తగ్గుతుంది? ఎలాంటి సినిమాలపై ఈ ప్రభావం కనిపిస్తుంది అనేది ఓ ఆరేడు నెలలు గడిస్తే కానీ అంచనాకు రాలేమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈలోపు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పూర్తిగా జనాలను తమ మాయలో పడేడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే ఆ దాదాపుగా ఆ ట్రెండ్ కనిపిస్తోంది. ఈ విషయం పై తాజాగా సీనియర్ నిర్మాత సురేష్ బాబు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
ఓటీటీ వేదికలే నేరుగా సినిమాల్లో పెట్టుబడి పెడితే బాగుంటుందని ఆయన అన్నారు. ఈ మాట చెప్పగానే మరి సంప్రదాయ నిర్మాతలు కనుమరుగైపోతారు కదా అనే అనుమానం రావొచ్చు. ఒక నిర్మాత అయి ఉండి సురేష్ బాబు అలాంటి భస్మాసుర హస్తం టైపు సలహా ఎందుకు ఇస్తారు? ఒటీటీలు పెట్టుబడి పెడతాయి కానీ ఆ ప్రాజెక్టుల ఎగ్జిక్యూషన్ నిర్మాతలకు ఇస్తే బాగుంటుందనేది సురేష్ బాబు ఆలోచన. ఒక ఉదాహరణ తీసుకుంటే ఎవరైనా ఒక దర్శకుడు మంచి స్క్రిప్ట్ తో ఒటీటీ ప్లాట్ ఫామ్ వద్దకు వెళ్తారు. ఆ సబ్జెక్ట్ వారికి నచ్చితే బడ్జెట్ వారే ఇస్తారు. ఆ ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతను ఒటీటీ వారు ఒక నిర్మాతకు అప్పజెప్తారు. అంటే సురేష్ బాబు లేదా మరో నిర్మాత కు అన్నమాట.
ఇది నిజంగానే వినూత్నమైన ఆలోచన. ఇప్పటికే అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ లాంటి అగ్రశ్రేణి ఒటీటీ వేదికలు సొంతంగా వెబ్ సీరీస్.. వెబ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్నాయి. సినిమాలను కూడా కొనుగోలు చేస్తున్నారు. సినిమాలను కొనుగోలు చేసేందుకు వెచ్చించే బడ్జెట్ ఏదైతే ఉందో అది ఈ సినిమాల నిర్మాణానికి మళ్ళించవచ్చు. నిర్మాతలకు సినిమాల నిర్మాణంలో అపార అనుభవం ఉంటుంది కాబట్టి వారు ప్రాజెక్ట్ పూర్తి చేసి ఒటీటీ చేతిలో పెడతారు. నిర్మాతలకు కూడా నష్టం ఉండదు. అలా అని భారీ లాభాలు రావు. అయితే నిర్మాతలు పెట్టినట్టు భారీ బడ్జెట్లు పెట్టరు కాబట్టి బడ్జెట్లు తగ్గే అవకాశం ఉంది. స్టార్ హీరోల భారీ రెమ్యూనరేషన్ల విషయంలో కూడా కోత పడే అవకాశం ఉంది. ఆలోచన అయితే అదిరింది.