Begin typing your search above and press return to search.

సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువే.. తప్పేం కాదు : సురేష్ బాబు

By:  Tupaki Desk   |   26 Dec 2020 11:00 AM IST
సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువే.. తప్పేం కాదు : సురేష్ బాబు
X
‘సినిమా ఇండస్ట్రీలో బంధుప్రీతి (నెపోటిజం) ఎక్కువగానే ఉంది. అయితే.. అందులో తప్పేం లేదు’ అన్నారు ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు. లేటెస్ట్ గా ఈ విషయంపై మాట్లాడిన ఈ స్టార్ ప్రొడ్యూసర్.. బంధుప్రీతి అంతటా ఉంటుందన్నారు. అది సినిమాల్లో, రాజకీయాల్లో ఎక్కువగా ఉందన్నారు.

‘నెపోటిజం అనేది సమాజంలో చాలా సహజమైన విషయం. అన్ని వ్యాపారాలలో ఈ బంధుప్రీతి ఉంటుంది’ అన్నారు సురేష్ బాబు. అయితే.. సక్సెస్ మాత్రం టాలెంట్ పైనే ఆధారపడి ఉంటుందని, ప్రతిభ లేకపోతే ఉపయోగం లేదని చెప్పుకొచ్చారు. దీనికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు సురేష్ బాబు. ‘హీరో నాని, శోభన్ కు.. నేను, రామ్మోహన్ బ్రేక్ ఇచ్చాం. వారు బయట నుంచి వచ్చిన వారే. అయితే.. వారి ప్రతిభ మాత్రమే వారిని విజయతీరాలకు చేర్చింది’ అన్నారు.

‘అల్లరి’ నరేష్, అతని సోదరుడు రాజేష్ ఇద్దరికీ సురేష్ ప్రొడక్షన్స్ బూస్ట్ ఇచ్చింది. కానీ.. నరేష్ మాత్రమే సక్సెస్ అందుకున్నాాడని సురేష్ బాబు అన్నారు. ఇతర వృత్తులు, వ్యాపారాలలో ఉన్న ప్రతీ తండ్రిలాగే.. సినీ పరిశ్రమకు చెందిన స్టార్లు తమ పిల్లలకు ఇండస్ట్రీలో అవకాశం ఇప్పిస్తారని చెప్పారు సురేష్ బాబు.

ఒక డాక్టర్.. తన కొడుకు డాక్టర్ కావాలని కోరుకోవడం లాంటిదే ఇది కూడా అన్నారు. ‘నెపోటిజం ప్రతిచోటా ఉంది. అయితే.. ఇది సినీ ఇండస్ట్రీలో, రాజకీయాల్లో, క్రీడల్లో ఎక్కువగా ఉంది’ అని అన్నారు సురేష్ బాబు. అయితే.. ఇందులో తప్పేం లేదన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు తమవంతుగా అవకాశం ఇప్పించాలని చూస్తారన్న ఈ ప్రొడ్యూసర్.. దాన్ని అందిపుచ్చుకొని తమని తాము నిరూపించుకోవాల్సింది పిల్లలే అని అన్నారు.