Begin typing your search above and press return to search.

పెళ్లి వాయిదా పడలేదు.. పుకార్లు నమ్మొద్దు: దగ్గుబాటి ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   10 Jun 2020 3:00 PM GMT
పెళ్లి వాయిదా పడలేదు.. పుకార్లు నమ్మొద్దు: దగ్గుబాటి ఫ్యామిలీ
X
టాలీవుడ్ బ్యాచిలర్ హీరో రానా.. తన గర్ల్ ఫ్రెండ్ మిహీకా బజాజ్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి అభిమానులతో పాటు అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేగాక వీరి ప్రేమ వ్యవహారాన్ని ఇరు వైపులా కుటుంబాలు అంగీకరించడంతో పెళ్లి వార్త కన్ఫర్మ్ అయింది. అందులో భాగంగా గత నెల 21న రానా, మిహికా బజాజ్‌ల రోకా వేడుక కుటుంబ సమక్షంలో పూర్తి చేశారు. మరి కొద్ది రోజులలో నిశ్చితార్ధం కూడా జరుగనుంది. ఇక నిశ్చితార్ధం జరగక ముందే ఆగస్ట్‌ 8న వీరి పెళ్లి జరుగుతుందని సురేష్ బాబు ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ పెళ్లి కూడా మూడు రోజుల పాటు జరగనుందని తెలిపారు. ఆ వార్త తెలియగానే అభిమానులు తమ హీరో పెళ్లి ఆగష్టులో జరగోతున్నట్టు ఆనందపడ్డారు. తాజాగా వీరి పెళ్లి వాయిదా పడ్డట్టు వార్తలు హల్చల్ చేసాయి.

ఇప్పటి వరకు లాక్‌డౌన్ నేపథ్యంలో కరోనా కేసుల నియంత్రణ కష్టం అయింది. ఇక తాజాగా లాక్‌డౌన్ ఎత్తివేసాక పరిస్థితి తారుమారు అయింది. కరోనా కేసుల సంఖ్య డబుల్ అయిపోయింది. దీంతో ఇరువురికి చెందిన కుటుంబ సభ్యులు ప్రస్తుతానికి వీళ్ల పెళ్లి వాయిదా వేస్తామన్నట్లు వారు నిర్ణయం తీసుకున్నారని అంతా అనుకున్నారు. ఇటీవలే యంగ్ హీరో నిఖిల్ తన ప్రేయసి పల్లవి వర్మను పెళ్లి చేసుకున్నాడు. ఇక మరో హీరో నితిన్ కూడా మంచి రోజు కోసం వాయిదా వేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. రానా పెళ్లి పై వాయిదా అంటూ వస్తున్న పుకార్ల పై ఇరు కుటుంబ సభ్యులు స్పందించారు. పెళ్లి వాయిదా అనే మాటను వారు ఖండించారు. అనుకున్న ముహుర్తానికే ఆగష్టు 8న రానా మిహీకల పెళ్లి జరుగుతుందని సురేష్ బాబు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. చూడాలి మరి ఈ కరోనా ఎవరి పెళ్లిని ఎప్పుడు చేస్తుందో..!