Begin typing your search above and press return to search.

ఆయన మాత్రం సైలెంటే..

By:  Tupaki Desk   |   21 April 2018 10:11 AM IST
ఆయన మాత్రం సైలెంటే..
X
కాస్టింగ్ కౌచ్ పై వార్ అంటూ యాక్టర్ శ్రీరెడ్డి మొదలుపెట్టిన పోరాటం రామ్ గోపాల్ వర్మ ఎంట్రన్స్ తో పూర్తిగా సైడ్ ట్రాక్ పట్టింది. ఈ ఇష్యూతో సంబంధం లేని పవన్ కళ్యాణ్ ను తిట్టమని సలహా ఇచ్చింది తానేనంటూ మెగా ఫ్యామిలీకి.. అభిమానులకు మండిపోయేలా చేశాడు ఆర్జీవీ. ఇదంతా రాజకీయంగా తనపై చేస్తున్న కుట్ర అంటూ పవన్ ఎదురుదాడికి దిగాడు.

అసలు శ్రీరెడ్డి ఇష్యూలోకి ఆర్జీవీ ఎంటరైంది ఆమె ప్రొడ్యూసర్ సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ మోసం చేశాడు అనే దానిపై. దీనిపై సురేష్ బాబుతో మాట్లాడి రూ. 5 కోట్లు ఇప్పిస్తానంటూ తానే కల్పించుకుని అడిగానంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. కానీ ఈ ఇష్యూపై అందరూ అన్నీ మాట్లాడారు కానీ సురేష్ బాబు ఫ్యామిలీలో అందరూ సైలెంట్ గానే ఉన్నారు. వివాదం ఇంత పెద్దదిగా మారినా ఈ ఇష్యూలో ఆయన వెర్షన్ కానీ.. ఆయన కొడుకు వెర్షన్ ఏంటనేది కానీ బయటకు రాలేదు. జరిగే విషయాలన్నీ ఆయన దృష్టికి వెళ్తున్నా సురేష్ బాబుతో సహా ఫ్యామిలీలో అందరూ సైలెంట్ గా ఉన్నారు.

సురేష్ బాబు పెదవి విప్పి మాట్లాడితే ఏవి నిజాలు.. ఏవి అబద్ధాలు.. ఏవి కుట్రలు అనేదానిపై మరికొంత క్లారిటీ వస్తుంది. కోరి కొత్త తలనొప్పులు ఎందుకు తెచ్చుకోవడం అనుకుంటున్నారో ఏమో కానీ ఆయన మాత్రం వ్యూహాత్మక మౌనాన్నే పాటిస్తున్నారు. ఆర్టీవీ మాటల ప్రకారం చూస్తే... ‘‘ఈ విషయంలో తానేం జోక్యం చేసుకోబోనని.. తన కొడుకు తప్పు చేసుంటే చట్టప్రకారం శిక్ష ఫేస్ చేస్తాడని’’ సురేష్ బాబు క్లియర్ కట్ గా చెప్పేశారు. ఇక జరగాల్సింది చట్టం తన పని తాను చేసుకుపోవడమేనా?