Begin typing your search above and press return to search.

'పెళ్లి చూపులు' దర్శకుడితో దగ్గుబాటి వారసుడిని లాంఛ్ చేస్తారా..?

By:  Tupaki Desk   |   22 Dec 2020 4:39 PM GMT
పెళ్లి చూపులు దర్శకుడితో దగ్గుబాటి వారసుడిని లాంఛ్ చేస్తారా..?
X
ప్రముఖ నిర్మాత మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు కుమారులుగా ఇండస్ట్రీలోకి వచ్చారు సురేష్ బాబు - వెంకటేష్. ఒకరు స్టార్ ప్రొడ్యూసర్ గా మరొకరు స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. ఇక సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి రానా కూడా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 'లీడర్' సినిమాతో కెరీర్ ప్రారంభించిన రానా.. విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ సినిమాలలో కూడా నటిస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రానా.. రోజుకో అప్ డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాడు. అయితే సురేష్ బాబు చిన్న కొడుకు రానా త‌మ్ముడు అభిరామ్ ని హీరోగా ఎప్పుడు లాంఛ్ చేస్తారని దగ్గుబాటి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

వాస్తవానికి దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి ఆ మ‌ధ్య సురేశ్ బాబు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే అదే సమయంలో ఓ వివాదాస్పద నటి చేసిన కామెంట్స్ వల్ల అభి సైలెంట్ అయిపోవాల్సి వచ్చిందని టాక్ నడిచింది. దీని కారణంగా అభిరామ్ వార్తల్లో నిలిచినప్పటికీ.. హీరో లాంఛ్ మాత్రం ఆగిపోయింది. అయితే తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం దగ్గుబాటి వారసుడిని హీరోగా పరిచయం చేయడానికి మళ్ళీ ప్రయత్నాలు జరుగుతున్నాయట. 'పెళ్లి చూపులు' 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాలతో సురేష్ ప్రొడక్షన్స్ వారితో అనుబంధం కలిగివున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో అభిరామ్ ని లాంచ్ చేయించాలని సురేష్ బాబు ప్లాన్స్ చేస్తున్నారట. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.