Begin typing your search above and press return to search.

మార్పుచేర్పులు ముంచుతాయా తేలుస్తాయా?

By:  Tupaki Desk   |   8 Jun 2019 8:51 AM GMT
మార్పుచేర్పులు ముంచుతాయా తేలుస్తాయా?
X
రీమేక్ సినిమాలు సేఫ్ బెట్ అని జనరల్ గా చాలామంది నమ్ముతారు కానీ అదేమీ నిజం కాదు. ఒరిజినల్ సినిమాలోని ఆత్మను పట్టుకోకుండా సినిమాను తీసినా.. నేటివిటీని పట్టించుకోక పోయినా రిజల్ట్ తేడా కొట్టే అవకాశం ఉంటుంది. ఇక ఒరిజినల్ తో పోలికలు కూడా ఫిలిం మేకర్లను.. హీరో హీరోయిన్లను చికాకు పెడతాయి. ఈమధ్య తెలుగులో రిలీజ్ అయిన రీమేక్ సినిమాలు 'ఎబీసిడీ'.. 'ఫలక్ నుమా దాస్' ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యాయి. ఈ లిస్టులో మనం రెండో సినిమా పేరు చేర్చడం చూస్తే మళ్ళీ విశ్వక్ అన్న బూతులు లంకించుకుంటాడేమో..!

ఈ రీమేక్ సినిమాలు జనాలను మెప్పించలేకపోవడంతో ఇప్పుడు అందరి ఫోకస్ సమంతా ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఓ బేబీ'పైకి షిఫ్ట్ అయింది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ కొరియన్ సూపర్ హిట్ ఫిలిం 'మిస్ గ్రానీ' కి రీమేక్. ఇప్పటికే పలు భాషలలోకి రీమేక్ అయిన ఈ సినిమా ప్రతిచోటా విజయం సాధించింది. దీంతో తెలుగులో కూడా ఈ రీమేక్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని 'ఓ బేబీ' టీమ్ నమ్మకంగా ఉన్నారు.

ఈ సినిమా నిర్మాత డీ. సురేష్ బాబు రీసెంట్ గా మాట్లాడుతూ ఈ సినిమా ఒరిజినల్.. ఇతర రీమేక్ లలో ఉన్న మైనస్ పాయింట్లను సరిచేసుకుంటూ ఈ సినిమాను తెరకెక్కించినట్టు చెప్పుకొచ్చారు. ఈ మార్పుచేర్పులే కాకుండా మన నేటివిటి కి తగ్గట్టు స్క్రిప్ట్ లో చేసిన మార్పులు ఎలాగూ ఉంటాయి. ఇవన్నీ తెలుగులో ప్లస్ అవుతాయా లేదా అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు.