Begin typing your search above and press return to search.

ఏపీలో థియేటర్లు నడిపించడం నా వల్ల కాదు

By:  Tupaki Desk   |   22 July 2021 10:30 AM GMT
ఏపీలో థియేటర్లు నడిపించడం నా వల్ల కాదు
X
నారప్ప సినిమా విడుదల సందర్బంగా సురేష్‌ బాబు ఇంటర్వ్యూలో సోషల్‌ మీడియాలో తెగ చర్చనీయాంశం అవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా సురేష్‌ బాబు వ్యాఖ్యలు చాలా నెట్టింట హాట్ టాపిక్‌ అయ్యాయి. సినిమా ఇండస్ట్రీ పై మరియు హీరోలు నిర్మాతలు ప్రభుత్వాలు తన కుటుంబ సభ్యుల సినిమా ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడాడు. ఇప్పటికే ఓటీటీ రిలీజ్ కు తప్పేంటి ఆయన అనడంతో ఆ వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. ఇక తన కుటుంబ సభ్యులతో ఒక సినిమా నిర్మిస్తాను అంటూ ప్రకటించాడు. వాటితో పాటు తన రిటైర్మెంట్ గురించి కూడా మాట్లాడి మీడియాలో నిలిచాడు. ఈమద్య కాలంలో సురేష్‌ బాబు ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక ప్రత్యేకమైన విషయం చర్చకు రావడం.. దానిపై నిర్మొహమాటంగా మాట్లాడటం వంటి కారణాల వల్ల ఆయన ట్రెండ్‌ అవుతున్నాడు.

తాజాగా సురేష్ బాబు థియేటర్ల గురించి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఏపీలో ఉన్న టికెట్ల రేట్ల నేపథ్యంలో బిసి సెంటర్లలో థియేటర్లు నడపడం అసాధ్యంగా ఉంది. కనీసం సినిమా ప్రమోషన్ ఖర్చులు కూడా అక్కడ వచ్చే పరిస్థితి లేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నా మటుకు నేను ఏపీలో ప్రస్తుత టికెట్ల రేట్లతో నేను థియేటర్లను నడిపించను అంటూ సురేష్‌ బాబు స్పష్టంగా చెప్పాడు. ఏరియా ఏదైనా.. ప్రాంతం ఏదైనా కూడా ఒకే తరహా టికెట్ల రేట్లు ఉన్నప్పుడు మాత్రమే సినిమా ను విడుదల చేయగలం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఏపీ ప్రభుత్వం థియేటర్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లుగా ఈమద్య కాలంలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను సమర్థిస్తున్నట్లుగా సురేష్‌ బాబు వ్యాఖ్యలు ఉన్నాయంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట సురేష్‌ బాబు వ్యాఖ్యలు తెగ వైరల్‌ అవుతున్న నేపథ్యంలో ఇతర ఫిల్మ్‌ మేకర్స్ పలువురు ఆయన పలు అభిప్రాయాలకు మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్యంగా సురేష్ బాబు మాట్లాడుతూ ఈ సమయంలో జనాలను థియేటర్లకు తీసుకు రావాలని భావించడం ఎంత వరకు కరెక్ట్‌. ఈ సమయంలో ఓటీటీ కి వెళ్లడం లో తప్పేం లేదు అంటూ చాలా మంది నిర్మాతలకు ఆయన ఆదర్శంగా నిలిచాడు అనడం లో సందేహం లేదు. తన బ్యానర్‌ లో నిర్మిస్తున్న మొత్తం ఏడు సినిమా ల్లో కేవలం ఒక్క సినిమా మాత్రమే తన సొంతంగా నిర్మిస్తున్నాను.

ఆ సినిమా విషయంలో తప్ప ఇతర ఏ సినిమా ల విషయంలో కూడా కనీసం నేను నిర్ణయం తీసుకోలేను. కనుక ఓటీటీ రిలీజ్‌ ను అడ్డుకోలేను అంటూ చెప్పేసి ఇతర సినిమా లు కూడా ఓటీటీ లో విడుదల కాబోతున్నట్లుగా హింట్ ఇచ్చేశాడు. సురేష్‌ బాబు ఈ మద్య కాలంలో చేసిన వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తున్నారు. ఆయన ఆలోచన ఖచ్చితంగా చాలా ఉపయోగదాయం. సుదీర్ఘ ఫిల్మ్‌ మేకింగ్‌ అనుభవం ఉన్న ఆయన్ను ఆదర్శంగా తీసుకోవడం లో ఎలాంటి తప్పు లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.