Begin typing your search above and press return to search.

నెక్స్ట్ ఫోకస్ సురేందర్ రెడ్డి మీదే!

By:  Tupaki Desk   |   3 Sep 2019 3:57 AM GMT
నెక్స్ట్ ఫోకస్ సురేందర్ రెడ్డి మీదే!
X
'బాహుబలి' తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేసి శెభాష్ తెలుగోడా అనిపించుకున్నాడు రాజమౌళి. నిజానికి 'బాహుబలి (ది బిగినింగ్) తో వచ్చిన అంచనాలను బాహుబలి(ది ఎండ్) తో అందుకొని అందరిచే జేజేలు కొట్టించుకున్నాడు జక్కన్న. ఆ తర్వాత ఆ సినిమాను మళ్లీ అందుకునే సత్తా సాహోకే ఉందనుకున్నారు. కానీ సుజిత్ ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. #సాహో'తొలి రోజే నెగిటీవ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ పరంగా ఈ మూడు రోజులు బాగానే ఆడిన లాంగ్ రన్ లో భారీ కలెక్షన్స్ రాకపోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే ఇప్పుడు 'సాహో' తర్వాత అందరి ఫోకస్ 'సైరా' మీదకి మళ్లింది. టీజర్స్ తో వచ్చిన హైప్ ను సురేందర్ రెడ్డి అందుకుంటాడా..అన్నది ఇప్పుడు అందరిలో మొదలైన ప్రశ్న. 'ధృవ' తో బ్లాక్ బస్టర్ అందుకున్న సురేందర్ రెడ్డి సైరా ను బాగానే డీల్ చేశాడని - ముఖ్యంగా సైరా క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ కొన్ని సన్నివేశాలను ఆకట్టుకునేలా తీసాడని ఇసైడ్ టాక్. కానీ సురేందర్ రెడ్డి రాజమౌళిని అందుకోగలడా...నార్త్ ప్రేక్షకులను కూడా తన మేకింగ్ స్టైల్ తో మెప్పించి గ్రాండ్ హిట్ అందుకోగలడా అన్నదే డౌట్.

నిజానికి సైరా కి సంబంధించి చరణ్ చాలా కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. బాలీవుడ్ లో కూడా సినిమాపై హైప్ తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. సెప్టెంబర్ నెలాఖరు నుండి ప్రమోషన్స్ లో ఇంకా వేగం పెంచనున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే ఉయ్యాలవాడ జీవిత కథలో చెప్పడానికి కూడా చాలా కంటెంట్ ఉంది. టీజర్స్ కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. మరి సురేందర్ రెడ్డి అయినా అంచనాలను అందుకుని ఓ గ్రాండ్ హిట్ ఇస్తాడని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.