Begin typing your search above and press return to search.

భళిరా బుల్లి సైరా- వైరల్ పిక్

By:  Tupaki Desk   |   27 Jan 2018 11:17 AM GMT
భళిరా బుల్లి సైరా- వైరల్ పిక్
X
ఇప్పటిదాకా ఒక్క షెడ్యూల్ షూటింగ్ మాత్రమే పూర్తి చేసుకున్న మెగాస్టార్ 151 మూవీ సైరా నరసింహారెడ్డి వచ్చే నెల రెండో షెడ్యూల్ కోసం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే దీని కోసం రకరకాల గెటప్స్ లోకి మారుతున్న చిరు కష్టపడుతున్న తీరు చూస్తుంటే కెరీర్ బెస్ట్ మూవీ అయ్యేలాగే కనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర రచయితల బృందం మొత్తం స్క్రిప్ట్ మొత్తాన్ని మరోసారి సీరియస్ గా క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారని టాక్. చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన సుప్రసిద్ధ రచయిత సత్యానంద్ నిన్న తన ఫేస్ బుక్ పోస్ట్ లో సైరా రైటర్స్ టీంతో కలిసి చిరంజీవితో తీసుకున్న ఫోటో దీనికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. వచ్చే నెల మొదటి వారానికి ఇదంతా కొలిక్కి వచ్చేస్తుంది.

ఇక సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి ఇది తప్ప మరో లోకం లేదు అన్నట్టుగా దీని మీదే ఏడాదికి పైగా తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. ఏ చిన్న అవకాశం దొరికినా సైరా మీద తనకు ఎంత ప్రేమ ఉందొ బయట పెట్టుకుంటూనే ఉన్నాడు. పైన ఫోటో చూసారుగా. సురేందర్ రెడ్డి-దీపా రెడ్డి దంపతుల గారాల బాబు ఆరిక్ రెడ్డి కి సైరా గెటప్ వేసి ఇలా ముచ్చట తీర్చుకున్నారు. వయసు చాలా చిన్నదే అయినా ఆ దుస్తులు వేయగానే హుషారు వచ్చింది కాబోలు నిజంగానే యమా చలాకీగా ఫోజులు ఇచ్చాడు బుడ్డోడు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

నిజానికి ఇది సైరాలో చిరు ఒరిజినల్ గెటప్ అని మరో టాక్ కూడా ఉంది. సూరి అదే పనిగా డిజైనర్ తో చెప్పి మరీ చేయించుకున్నాడట. కొణిదెల బ్యానర్ మీద నూట యాభై కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సైరాలో ఇతర కీలక నటులు ఇంకా ఎంటర్ కావాల్సి ఉంది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు ఒక్కొక్కరు వచ్చే నెల నుంచి షూట్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అప్పటి దాకా బుల్లి సైరాను చూస్తూ ఎంజాయ్ చేసేయండి.