Begin typing your search above and press return to search.

కిక్ 2 రిలీజ్ డేట్ వచ్చేసిందహో

By:  Tupaki Desk   |   30 July 2015 11:43 PM IST
కిక్ 2 రిలీజ్ డేట్ వచ్చేసిందహో
X
ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న కిక్ 2 రిలీజ్ డేట్ ఎట్టకేలకు తెలిసింది. ఇప్పటివరకు ఎన్నో డేట్స్ మిస్ అయ్యింది కిక్ 2. ఎప్పుడో మే 14న సినిమా రిలీజ్ కావాల్సి వున్నా అప్పుడు కొన్ని అనుకోని కారణాల వలన సినిమాను రిలీజ్ చేయలేకపోయారు. తమన్ బాబు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో బాగా డిలే చేస్తున్నాడని టాక్ వుంది. ఆ తరువాత దర్శకుడు సురేందర్ రెడ్డి కి నిర్మాత నందమూరి కళ్యాణ రామ్ కు మద్యలో విబేదాలు తలెత్తాయని మరో టాక్. ఏదేమైనా ఇప్పుడు ఎట్టకేలకు సినిమా రిలీజ్ అవుతోంది అంతే.

ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ప్రముఖ రేడియో స్టేషన్ రేడియో సిటీ 91. 1లో సందడి చేసాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కిక్ 2 సినిమా యాప్ ఒకటి లాంచ్ చేసాడు కూడా. ఇంతకీ రిలీజ్ డేట్ ఎప్పుడు సారూ అంటే ఆగష్టు 21న ఎత్తి పరిస్తితుల్లో సినిమా థియేటర్సలో వుండి తీరుతుందని సురేందర్ రెడ్డి స్పష్టం చేశాడు. రవితేజ హీరోగా, రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జిల్ ఫేం కబీర్ విలన్ గా నటిస్తున్నాడు.