Begin typing your search above and press return to search.
పవన్ ఫ్రీ అయ్యేలోపు అఖిల్ తో మూవీ
By: Tupaki Desk | 9 Sept 2020 6:14 AM ISTపవన్ తో సినిమాను కన్ఫర్మ్ చేసుకుని ఆయన డేట్ల కోసం వెయిట్ చేస్తే పుణ్య కాలం కాస్త గడిచి పోతుందనే విషయం ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకులకు తెలిసి వచ్చి ఉంటుంది. అందుకే ఆయనతో సినిమా కన్ఫర్మ్ అయిన దర్శకులు ఇతర సినిమాలను చేస్తున్నారు. సాదారణంగా ఏ స్టార్ హీరోతో సినిమా కన్ఫర్మ్ అయిన వారు మరో చిన్న హీరోతో సినిమా చేసేందుకు సిద్దం అవ్వరు. అందుకు ఆ హీరోలు కూడా ఒప్పుకోరు. స్టార్ హీరోల సినిమాలపై చిన్న హీరోతో దర్శకుడు చేయబోతున్న సినిమా తాలూకు ప్రభావం పడుతుందనే అభిప్రాయంను అంతా వ్యక్తం చేస్తుంటారు. కాని పవన్ మాత్రం అలాంటివి ఆలోచించ పోవడంతో దర్శకులు క్రిష్ మరియు సురేందర్ రెడ్డిలు పవన్ తో సినిమాలు కమిట్ అయినా ఆ లోపు చిన్న సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నారు.
దర్శకుడు క్రిష్ ఇప్పటికే పవన్ తో మూవీ చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. అయితే పవన్ డేట్లు ఇవ్వాలంటే ఇంకా చాలా సమయం పట్టనుంది. అందుకే ఈలోపు మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమాను తీయబోతున్నట్లుగా క్రిష్ ప్రకటించాడు. ఇటీవలే పవన్ తో మూవీని కన్ఫర్మ్ చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఈ లోపు అఖిల్ తో సినిమాకు రెడీ అయ్యాడు. నేడు అఖిల్ 5 సినిమాకు సంబంధించిన ప్రకటన ను నిర్మాత అధికారికంగా ప్రకటించబోతున్నాడు. అఖిల్ 5 తర్వాత పవన్ తో సూరి మూవీ ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాను చేస్తున్న అఖిల్ ఆ తర్వాత సూరి దర్శకత్వంలో నటించబోతున్నాడు. అనీల్ సుంకర నిర్మాణంలో రూపొందబోతున్న ఈ సినిమాకు సంబంధించి నేడు ఉదయం 9 గంటల 9 నిమిషాల 9 సెకన్లకు రాబోతుంది. సినిమాను వచ్చే ఏడాది ఆరంభంకు ప్రారంభించి.. అదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా సూరి ప్లాన్ చేస్తున్నాడు. ఇక పవన్ తో 2022 నుండి కొత్త సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.