Begin typing your search above and press return to search.
కొత్త అఖిల్ ను చూస్తామట?
By: Tupaki Desk | 7 Dec 2020 9:10 AM ISTఅఖిల్ అక్కినేని ఇప్పటి వరకు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూడు సినిమాల్లో కూడా లవర్ బాయ్ గా క్యూట్ బాయ్ గా కనిపించాడు. మొదటి సినిమాలో కాస్త మాస్ అనిపించేలా ప్రయత్నించినా కూడా క్యూట్ గానే కనిపించాడు. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా లో కూడా అఖిల్ లవర్ బాయ్ గెటప్ లోనే కనిపించబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే క్లీయర్ గా అర్థం అవుతుంది. అఖిల్ మొదటి సారి ఒక రఫ్ లుక్ లో కనిపించేందుకు సిద్దం అవుతున్నట్లుగా మీడియా సర్కిల్స్ ద్వారా సమాచారం అందుతోంది.
అఖిల్ 5వ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే. ఈ నెలలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ షూటింగ్ పూర్తి అవ్వనుంది. ఆ వెంటనే వచ్చే నెలలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాను అఖిల్ షురూ చేసే అవకాశం ఉంది. ఆ సినిమా కోసం ఇప్పటి నుండి రఫ్ లుక్ ను ట్రై చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫిజిక్ విషయంలోనే కాకుండా లుక్ విషయంలో కూడా ఈసారి కాస్త కొత్తగా అఖిల్ ను చూసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రఫ్ అండ్ మాస్ లుక్ లో అఖిల్ ను చూసేందుకు అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చైతూ ఒకటి రెండు చిత్రాల్లో రఫ్ లుక్ లో కనిపించే ప్రయత్నం చేసి పర్వాలేదు అనిపించాడు. మరి లవర్ బాయ్ ఇమేజ్ ను దక్కించుకున్న అఖిల్ క్యూట్ లుక్ నుండి రఫ్ లుక్ లోకి మారడం సాధ్యమేనా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాని దర్శకుడు సురేందర్ రెడ్డి మాస్ మసాలా ఎంటర్ టైనర్ లను తీయడంలో దిట్ట. అందుకే అఖిల్ ను మాస్ లుక్ లో సూరి చూపిస్తాడనే నమ్మకంను కొందరు అక్కినేని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ ను కొత్తగా చూడటంతో పాటు అఖిల్ ను ఒక కమర్షియల్ హిట్ మూవీలో చూడాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. అది సూరి మూవీతో తీరేనా లేదా చూడాలి.