Begin typing your search above and press return to search.
ఆ డైరెక్టర్ పరిస్థితి రెండికి చెడ్డ రేవడి మాదిరి తయారైందా..?
By: Tupaki Desk | 17 Feb 2021 1:00 PM ISTస్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర మరియు సురేందర్ రెడ్డి కలిసి నిర్మించనున్నారు. దీంతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయనున్నాడు సూరి. ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ముందుగా అఖిల్5 సినిమాని కంప్లీట్ చేసి తర్వాత పవన్ సినిమా పై ఫోకస్ పెట్టాలని సూరి ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు స్టైలిష్ డైరెక్టర్ పరిస్థితి రెండికి చెడ్డ రేవడి మాదిరి తయారైందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
పవన్ సినిమా కోసం స్టోరీ రెడీ చేయడానికి సురేందర్ ఆరు నెలల సమయం తీసుకున్నాడట. అయితే ఆ గడువు ముగిసిపోతున్నప్పటికీ ఇంతవరకు ఆ కథ ఇంకా లైన్ దశలోనే ఉందట. దీంతో పవన్ సినిమా విషయంలో సురేందర్ రెడ్డికి టెన్షన్ ఎక్కువై ప్రస్తుతం ఆ కథను పూర్తి చేసే పనిలో పడ్డాడట. ఇదే కనుక నిజమైతే అఖిల్ తో కమిటైన సినిమా లేటయ్యే అవకాశం ఉంది. మొన్నటి వరకు అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రిలీజ్ డేట్ తరువాత సినిమా స్టార్ట్ చేద్దామనే సాకు ఉండేది. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ కి రెడీ అయిపోయింది. దీంతో సురేందర్ రెడ్డి అటు పవన్ ని ఇటు అఖిల్ ని మ్యానేజ్ చేయలేక సతమతమవుతున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.