Begin typing your search above and press return to search.

స్టార్ హీరోలతో వర్క్ చేస్తున్నా స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరడం లేదే..!

By:  Tupaki Desk   |   7 Dec 2020 9:50 AM GMT
స్టార్ హీరోలతో వర్క్ చేస్తున్నా స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరడం లేదే..!
X
స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి 'అతనొక్కడే’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తరవాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'అశోక్'.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'అతిథి' సినిమాలు తెరకెక్కించి ప్లాప్స్ అందుకున్నాడు. కానీ తర్వాతి రోజుల్లో మాస్ మహారాజ్ రవితేజ తో ‘కిక్‌’.. రామ్ చరణ్ తో ‘ధృవ’.. అల్లు అర్జున్ తో 'రేసుగుర్రం' సినిమాలు తీసి సూపర్‌ హిట్స్ అందుకున్నాడు సురేందర్ రెడ్డి. మధ్యలో ఎన్టీఆర్ తో తీసిన 'ఊసరవెల్లి'.. రవితేజ తో తీసిన 'కిక్ 2' ప్లాప్ అయ్యాయి. ఈ క్రమంలో గతేడాది మెగాస్టార్ చిరంజీవితో పాన్ ఇండియా లెవల్లో 'సైరా నరసింహారెడ్డి' సినిమా తీశాడు. అయితే స్టార్ హీరోలతో సినిమాలు తీసినా సురేందర్ మాత్రం స్టార్ డైరెక్టర్స్ లిస్టులో జాయిన్ కాలేకపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే దీనికి ప్రధాన కారణం కంటిన్యూస్ గా విజయాలు అందుకోక పోవడమేనని సినీ వర్గాలు అంటున్నాయి. 'సైరా' విడుదలైన తొమ్మిది నెలలకు సురేందర్ రెడ్డి రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో అక్కినేని అఖిల్ హీరోగా ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి డైరెక్టర్ సూరి కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించనున్నాడు. దీంతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ముందుగా అఖిల్5 చిత్రాన్ని కంప్లీట్ చేసి.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే సురేందర్ రెడ్డి అగ్ర దర్శకుల లిస్టులో చేరే అవకాశం ఉంది. నేడు 45ఏట అడుగుపెడుతున్న సురేందర్ రెడ్డి.. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో బ్లాక్ బస్టర్స్ అందుకోవాలని కోరుకుంటూ 'తుపాకీ డాట్ కామ్' ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.