Begin typing your search above and press return to search.

సురేఖ వాణి.. చాలా హాట్ గురూ

By:  Tupaki Desk   |   6 Oct 2017 4:35 AM GMT
సురేఖ వాణి.. చాలా హాట్ గురూ
X
హాట్ హాట్ ఫోజుల్తో చూడగానే మతిపోయేలా ఫోజులివ్వడం హీరోయిన్లకు మామూలే. తమలోని గ్లామర్ కంటెంట్ ప్రపంచానికి తెలిసేలా ప్రత్యేకంగా ఫొటోలు తీయించుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ హాట్ పిక్స్ మూలంగానే కొన్నిసార్లు కొత్త అవకాశాలు వస్తుంటాయి. తాజాగా హీరోయిన్లకు పోటీగా ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు కూడా హాట్ ఫోజుల్తో అందరినీ ఆకట్టుకుంటోంది.

టాలీవుడ్ లోన బిజీబిజీగా ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖా రాణి. వదిన.. సిస్టర్ పాత్రలతో హోమ్లీ క్యారెక్టర్లలో చాలా పద్ధతిగా కనిపిస్తుంటుంది. ఒక్కసారిగా ఈమె తెలుగు ప్రేక్షకులందరికీ తనలో ఉన్న ఇంకో యాంగిల్ ని పరిచయం చేసింది. ఈ మధ్య సురేఖా వాణి యూఎస్ కు వెకేషన్ పై వెళ్లింది. ఈసందర్భంగా తీయించుకున్న ఫొటో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. తన సోయగాలన్నీ ప్రదర్శిస్తూ వెస్ర్టన్ లుక్కులో కారుపై వయ్యారంగా ఆనుకుని ఉన్న ఫొజుతో.. ఇంతందాన్ని ఇంతకాలం మిస్సయిపోయామని నిస్సందేహంగా ఒప్పుకోవచ్చు.

సురేఖ వాణి పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్టు అయినా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని లుక్స్ ఆమె సొంతం. అందుకే ఒక్క ఫొటోతో గ్లామర్ ప్రియులందరినీ మెప్పించేసింది. అయితే సురేఖావాణి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఇప్పుడు హీరోయిన్ తరహా పాత్రలంటే కష్టమే.