Begin typing your search above and press return to search.

ఆడెవడో కూడా మీరే చెప్పండి.. ఈ చూసేదేదో కొంచెం డబ్బులున్న వాడిని చూడమని కూడా చెప్పా!

By:  Tupaki Desk   |   6 May 2021 3:30 AM GMT
ఆడెవడో కూడా మీరే చెప్పండి.. ఈ చూసేదేదో కొంచెం డబ్బులున్న వాడిని చూడమని కూడా చెప్పా!
X
సినీ అభిమానులకు నటి సురేఖా వాణి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. వెండితెరపై సాంప్రదాయంగా కనిపించే సురేఖా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్‌ హాట్ ఫోటోలు పెడుతూ రచ్చ చేస్తుంది. పెళ్లీడుకొచ్చిన తన కూతురుతో కలిసి పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తుంది. ఈ క్రమంలో సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే తన సెకండ్ మ్యారేజ్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేసింది. అయితే తాజాగా అలీ హోస్ట్ చేస్తున్న ఓ టాక్ షోకి మరో నటి రజితతో కలిసి హాజరైన సురేఖా వాణి.. తన రెండో పెళ్ళికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేసింది.

ఈ సందర్భంగా రెండో పెళ్లి గురించి అలీ ప్రస్తావించగా.. దీనిపై సురేఖ వాణి క్లారిటీ ఇచ్చింది. ''ఆడెవడో కూడా మీరే చెప్పండి.. ఈ చూసేదేదో కొంచెం డబ్బులున్న వాడిని చూడమని కూడా చెప్పా'' అని సురేఖ నవ్వుతూ చెప్పింది. 'డబ్బున్న వాడు కావాలా? మనసున్న వాడు కావాలా?' అని అలీ అడుగగా.. ''మనసు ఏమి చేసుకుంటామండి.. మనసుతో పనులు జరగవని అర్థమైపోయింది'' అని సురేఖ వాణి చెప్పుకొచ్చింది. అయితే దీని వెనుక ఏదో పెద్ద స్టోరీ ఉన్నట్టుందని అలీ అడగడంతో కచ్చితంగా ఉందని చెప్పింది. అలానే సోషల్ మీడియాలో ఫోటోల గురించి అలీ ప్రశ్నించగా 'తన ఫోటోలంటే యూట్యూబ్, వెబ్‌ సైట్ల వాళ్లకి చాలా ఇష్టమ'ని సురేఖ చెప్పారు. డౌట్‌ గా మాట్లాడుతున్నారేంటి? అని అలీ ప్రశ్నించగా.. 'మళ్ళీ ఏమంటే ఏం కాంట్రావర్సీ అవుతుందో?' అని ఆమె తెలిపింది. ఇంతలో పక్కనే ఉన్న రజిత మాట్లాడుతూ సురేఖకి సోషల్‌ మీడియాలో మామూలు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ లేదు' అని అన్నారు.

అలానే ఈ సందర్భంగా తన భర్తను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు సురేఖ. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన భర్త కుటుంబం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని.. అన్నీ తామే సమకూర్చుకున్నామని తెలిపింది. 'నన్ను నా కూతుర్ని వాళ్లు ఎన్నో మాటలు అన్నారు. ఈ ప్రోగ్రామ్‌ చూశాకైనా వాళ్లు సిగ్గు తెచ్చుకోవాలి' అని సురేఖ వాణి కాస్త ఘాటుగా మాట్లాడారు.