Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: మోడరన్ వీణ మీటుతున్న ఆంటీలు

By:  Tupaki Desk   |   14 March 2020 12:15 PM IST
ఫోటో స్టోరీ: మోడరన్ వీణ మీటుతున్న ఆంటీలు
X
నటి సురేఖా వాణి పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు తక్కువమందే ఉంటారు. దాదాపు యాభైకి పైగా తెలుగు సినిమాల్లో సురేఖ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక మరో నటి ప్రియ గురించి కూడా అందరికీ తెలిసిందే ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. ఈమధ్య ఈ ఇద్దరు కలిసి ఇచ్చిన ఓ కిరాకు పోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇద్దరూ ఒకేరకమైన డార్క్ కలర్ అడిడాస్ గౌన్ లు ధరించి చలాకీగా ఫోటోకు పోజిచ్చారు. మోకాలివరకూ ఉండే గౌన్లు కావడంతో నెటిజన్లు అందరూ 'సామజవరగమనా' అంటూ పాటేసుకుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. బ్రైట్ గా ఉండే లిప్ స్టిక్కులు.. డార్క్ గా ఉండే నెయిల్ పాలిష్ లతో ఇద్దరూ హాట్ గా బోల్డ్ గా ఉండే కవలల తరహాలో కనిపిస్తుండడం విశేషం. ఇద్దరూ బేబీ పింక్ కలర్ షూ ధరించి మ్యాచింగ్ మ్యాచింగ్ అంటున్నారు. ఈ వయసులో కూడా ఇలా ఫిట్ గా ఉండడం.. గ్లామరస్ గా కనిపించడం అనేది చాలా కష్టమైన విషయం. అయితే ఆ పనిని ఎంతో ఈజీగా చేసి చూపిస్తున్నారు.

ఈ ఫోటోకు సోషల్ మీడియాలో సూపర్ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అడిడాస్ ఆంటీలు హంగామా చేస్తున్నారని.. అడిడాస్ ఆంటీల ముందు ముంబై ఇంపోర్ట్ చపాతీలు జుజుబీ అని కళాత్మకంగా వర్ణిస్తున్నారు.