Begin typing your search above and press return to search.
నా కూతురు సినిమాల్లోకి వెళ్తానంటే నో చెప్పను..
By: Tupaki Desk | 11 May 2020 10:47 AM ISTటాలీవుడ్ లో అందమైన హీరోయిన్లతో పాటు అందమైన క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అందులో ఒకరు సురేఖావాణి. ఎల్లప్పుడూ సినిమాలలో తెలుగుదనం నిండిన పాత్రలలో అభిమానులను అలరించే సురేఖావాణి.. చేసే అన్నీ పాత్రలలో అంటే.. ఓ తల్లిగా, అక్కగా, వదినగా ఇలా ఇచ్చిన ప్రతి క్యారెక్టర్ లో ఒదిగిపోయే టాలెంట్ కలిగి ఉన్నారు. కానీ సురేఖావాణి అంటే కేవలం తెలుగుదనమే కాదు, ఆమెలో ఒక ఈతరం మోడ్రన్ మదర్ కూడా ఉంది. ఎందుకంటే సురేఖావాణి ఇంస్టాగ్రామ్ చూసినట్లయితే మీకే అర్ధమవుతుంది. ఈ మధ్య సినిమాలలో అరుదుగా కన్పిస్తున్న సురేఖావాణి, సోషల్ మీడియాలో మాత్రం ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా చక్కగా చీర కట్టుకొని ఉంటుందేమో అనుకుంటే పొరపాటే.
కొత్త కొత్త మోడ్రన్ డ్రెస్సులతో, స్టైలిష్ ఫోటోషూట్లతో ఇంస్టాగ్రామ్ మొత్తం సెగలు పుట్టిస్తుంది. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు సురేఖావాణి ఆంటీనా.. అమ్మాయా అని. సురేఖావాణి తన ఇంస్టాగ్రామ్ లో అప్పుడప్పుడు తన కూతురుతో దిగిన ఫోటోలను షేర్ చేస్తుంది. అయితే కూతురిని ఎంత మోడ్రన్ గా పెంచుతుందో.. తాను కూడా కూతురితో మోడ్రన్ గా తయారవుతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. కూతురితో పాటు అలా మీరు కూడా ఏంటని ప్రశ్నిస్తే.. "నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్లు నేను జీవిస్తాను. నా జీవితాన్ని, నా కూతురిని ఎవరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఇద్దరం కలిసి పబ్స్, షికార్లు, సినిమాలు ఇలా అన్నింటికీ వెళ్తాము. నన్ను నా తల్లి ఎలా పెంచిందో.. నేను నా కూతురిని అంతే స్వేచ్ఛ భావాలతో పెంచుతాను. ఇంకా నా కూతురిని సినిమాల్లోకి పంపిస్తారా అనే విషయం పై.. పూర్తిగా నా కూతురిపై ఆధారపడి ఉంది. తను వెళ్తానంటే నేను అడ్డు చెప్పను.. అంటూ ఖరాఖండిగా తేల్చి చెప్తుంది.