Begin typing your search above and press return to search.

అయ్యో సురభీ.. అలా జరిగిందా!!

By:  Tupaki Desk   |   17 Jan 2016 5:30 PM GMT
అయ్యో సురభీ.. అలా జరిగిందా!!
X
కొత్తమ్మాయ్‌ సురభీ ఉంది చూశారూ.. అప్పట్లో బీరువా సినిమాలో అందాల బత్తాయిపండులా ఉందని అందరూ పొగిడేసినా.. ఆ సినిమా డిజాష్టర్‌ కావడంతో ఇక్కడెవ్వరూ పట్టించుకోలేదు. కాని ''ఎక్స్‌ప్రెస్‌ రాజా'' విషయంలో మాత్రం విజయలక్ష్మి అమ్మడిని ఇట్టే వరించేసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ గా మార్కులు వేయించుకుని.. ఇప్పుడు టాలీవుడ్‌ లో మరో రెండు సినిమాలు సైన్‌ చేయడానికి రెడీగా ఉన్నా కూడా.. అమ్మడికి ఢిల్లీలో మాత్రం పెద్దగా క్రేజ్‌ రాలేదట. పదండి అసలేంటో చూద్దాం.

అబ్బే.. అమ్మడి ఇంట్లో కూడా తెలియదు.. ఈమె ఒక హ్యాపెనింగ్‌ హీరోయిన్‌ అని. ఢిల్లో లో ఫైన్‌ ఆర్ట్స్‌ (పెయింటింగ్‌)లో డిగ్రీ పూర్తి చేసిన ఈ సుందరి.. ఇప్పటివరకు కనీసం హీరోయిన్‌ గా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఎవ్వరికీ చెప్పలేదట. అందుకే ఇప్పుడు సడన్‌గా నేను హీరోయిన్‌ అయ్యాను అంటూ తన స్నేహితులకు తన ఫోటోలు.. పోస్టర్లు చూపిస్తుంటే.. వారు నమ్మట్లేదట. సో.. ఏదన్నా ఒక రేంజులో ఏదో ఒక సినిమాతో భారీ పేరు తెచ్చకుంటేనే సురభిని అక్కడ ఢిల్లీలో తన స్నేహితులూ తన ఫ్యామిలీ గుర్తిస్తారనమాట.