Begin typing your search above and press return to search.

సుప్రియ సొంత బ్యానర్.. అడివి శేష్ సహకారం

By:  Tupaki Desk   |   2 May 2020 5:30 PM GMT
సుప్రియ సొంత బ్యానర్.. అడివి శేష్ సహకారం
X
అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ చాలాకాలంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ బాధ్యతలు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సుప్రియ ఓ కొత్త బ్యానర్ స్థాపించడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. అన్నపూర్ణ సంస్థకు పని చేస్తూనే మరోవైపు ఈ కొత్త బ్యానర్ బాధ్యతలు కూడా చూసుకుంటారట.

ఈ బ్యానర్లో మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు తీసేందుకుప్లానింగ్ జరుగుతోందట. ఇప్పటికే వయాకామ్ పిక్చర్స్ వారు తెలుగు పలు సినిమాలకు ఫండింగ్ చేస్తున్నారు. సుప్రియ కొత్త బ్యానర్ కు వారే బ్యాకెండ్ లో ఫండింగ్ ఇస్తారట. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్.. స్క్రిప్టులు ఫైనలైజ్ చెయ్యడం తదితర వ్యవహారాలలో హీరో అడివి శేష్ సహకారం ఉంటుందని అన్నపూర్ణ స్టూడియో వర్గాల వారు చెప్తున్నారు. ఈ బ్యానర్ పై ఒటీటీలను టార్గెట్ చేస్తూ కూడా ఒరిజినల్ ఫిలిమ్స్ నిర్మాణం చేపడతారని అంటున్నారు.

సరైన టీమ్ లేని కారణంగా వరస ఫెయిల్యూర్లతో అన్నపూర్ణ బ్రాండ్ వ్యాల్యూ పడిపోతోందని.. దాన్ని నివారించడానికి సుప్రియ ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు. గతంలో గీతా ఆర్ట్స్ వారు కూడా జీఎ2 పిక్చర్స్ బ్యానర్ స్థాపించి వరస హిట్లు సాధించారు. ఇప్పుడు సుప్రియ కూడా అదే మోడల్ ఫాలో అవుతున్నారని అంటున్నారు.