Begin typing your search above and press return to search.

ఆడియన్స్ కు థ్యాంక్స్ అంటున్న సుప్రియ

By:  Tupaki Desk   |   4 Aug 2018 5:37 PM IST
ఆడియన్స్ కు థ్యాంక్స్ అంటున్న సుప్రియ
X
అక్కినేని నాగార్జున మేనకోడలయిన సుప్రియ యార్లగడ్డ 'గూఢచారి' సినిమాద్వారా తెలుగు తెరకు రీ-ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ డెబ్యూ సినిమాలో హీరోయిన్ గా నటించిన తర్వాత ఇప్పటివరకూ మరే సినిమాలో నటించలేదు. ఇంత గ్యాప్ వచ్చినా తనను 'గూఢచారి' సినిమాలో ఆదరిస్తున్నందుకు ఆడియన్స్ కు కృతఙ్ఞతలు అంటోంది సుప్రియ.

సినిమాకు మౌత్ టాక్ - రివ్యూస్ పాజిటివ్ గా ఉండడంతో 'గూఢచారి' టీమ్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సందర్భంగా తన అంతరంగాన్ని మీడియా తో పంచుకుంది సుప్రియ. తను మొదట్లో ఒక రైటర్ కావాలని అనుకుందట.. కానీ ప్రొడక్షన్ లో వచ్చి పడిందట. 'గూఢచారి' సినిమా గురించి మాట్లాడుతూ "శేష్ - శశి కిరణ్ నన్ను కలిసి నాకు 'గూఢచారి' స్క్రిప్ట్ వినిపించి ఓ పాత్ర ఆఫర్ చేశారు. ఆ సినిమా స్క్రిప్ట్ నన్ను ఎగ్జైట్ చేసింది." సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం చాలా ఎమోషనల్ గా ఉంటుందని అది తనకు బాగా నచ్చిందని తెలిపింది.

అక్కినేని అభిమానులతో తను టచ్ లో ఉంటుంటానని, ఈ సినిమా చూసి చాలామంది అక్కినేని అభిమానులు అభినందనలు తెలుపుతున్నారని చెప్పింది. భవిష్యత్తులో సినిమాలు చేస్తారా అని అడిగినప్పుడు 'గూఢచారి' సినిమాలో తను చేసిన పాత్రలాగా స్టఫ్ ఉన్నవైతే తప్పనిసరిగా చేస్తానని తెలిపింది.