Begin typing your search above and press return to search.

అక్కినేని హీరోయిన్ రీఎంట్రీకి రెడీ!

By:  Tupaki Desk   |   22 Nov 2017 4:10 PM IST
అక్కినేని హీరోయిన్ రీఎంట్రీకి రెడీ!
X
టాలీవుడ్ వరకూ చూసుకుంటే.. వారసులు హీరోలుగా తెరంగేట్రం చేయడం ఎప్పటి నుంచో ఉంది. కానీ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చేందుకు మాత్రం ఎవరూ అంగీకరించేవారు కాదు. స్టార్స్ అయితే ఈ విషయంలో మరీ ఎక్కువగా పట్టు పట్టేవారు. ఈ కల్చర్ కు ముగింపు పలికి.. తమ ఇంటి నుంచి ఓ అమ్మాయి హీరోయిన్ అయేందుకు అంగీకరించిన తొలి వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు.

తన మనవరాలు సుప్రియను హీరోయిన్ గా పరిచయం చేసేందుకు అభ్యంతరాలు చెప్పలేదు ఆయన. నాగార్జున మేనకోడలు అయిన సుప్రియ.. పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. అయితే.. ఆ తర్వాత మళ్లీ చదువుల్లో పడిపోయిన ఆమె.. తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతల్లో మునిగిపోయింది. పెళ్లి చేసుకోవడం.. విబేధాలతో విడాకులు తీసుకోవడం కూడా జరిగిపోయాయి. ఇష్టం మూవీలో హీరోగా నటించిన చరణ్ రెడ్డితో ఈమె వివాహం జరగ్గా.. కొన్నేళ్లకు విడిపోయారు. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత సుప్రియ మళ్లీ సినిమలాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గూఢచారిలో ఓ కీలక పాత్రలో సుప్రియ కనిపించనుందట. అడవి శేష్ కు- సుప్రియ సోదరుడు అయిన సుమంత్ కు మధ్య మంచి స్నేహం ఉంది. నటనలో సత్తా చాటాలనే ఆసక్తి ఒకవైపు.. అడివి శేష్ నుంచి లభించిన ప్రోత్సాహం మరోవైపు తోడవడంతో.. సుప్రియ రీఎంట్రీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.