Begin typing your search above and press return to search.

ఫొటో స్టొరీ: అదరగొట్టిన అక్కినేని మేనకోడలు!

By:  Tupaki Desk   |   19 July 2018 4:52 AM GMT
ఫొటో స్టొరీ: అదరగొట్టిన అక్కినేని మేనకోడలు!
X
నాగార్జున మేనకోడలు అయిన సుప్రియ యార్లగడ్డ ఒకే సినిమాలో తళుక్కున మెరిసింది. ఆ సినిమానే 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'.. పవర్ స్టార్ గా ప్రేక్షకులచేత జేజేలు అందుకున్న పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం కూడా అదే. కానీ ఎందుకో సుప్రియ తర్వాత మరే సినిమాలో నటించలేదు. అన్నపూర్ణ బ్యానర్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో మాత్రం మేనమామ నాగ్ కు సహకారం అందిస్తూ ఉండేది. చాలా ఏళ్ళ తర్వాత సుప్రియ ఇప్పుడు మళ్ళీ ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది..అదే 'గూడచారి'.

అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్లర్ లో సుప్రియ ఒక కీలక పాత్ర పోషించింది. 'గూడచారి' టీమ్ రీసెంట్ గా సుప్రియ పాత్ర కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. నదియా ఖురేషి అనే రోల్ లో సుప్రియ కనిపిస్తుందని పోస్టర్ లో వెల్లడించారు. 'లేడీస్ అఫ్ గూడచారి' అనే క్యాప్షన్ తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో సుప్రియను డిప్యూటీ డైరెక్టర్, చీఫ్ టాస్క్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అని.. ఆమె 92FS మోడల్ వెపన్ ను వాడుతుందని.. ఓ స్ట్రాంగ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. అవన్నీ పక్కన పెడితే సుప్రియ మాత్రం పోస్టర్ లో సీరియస్ లుక్ .. చార్మింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అదరగొట్టిందంతే!

T. శశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హీరో అడివి శేష్ కథ అందించడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న 'గూడచారి' ఆగష్టు 3 న థియేటర్లలో అడుగుపెట్టనున్నాడు.