Begin typing your search above and press return to search.

అప్పటి అమ్మాయి ఇన్నేళ్లకొచ్చింది

By:  Tupaki Desk   |   8 July 2018 7:10 AM GMT
అప్పటి అమ్మాయి ఇన్నేళ్లకొచ్చింది
X
పవన్ కళ్యాణ్ చేసింది పాతిక సినిమాలే కాబట్టి అభిమానులకు ప్రతి ఒక్కటి గుర్తే. అందులోనూ డెబ్యూ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటే మరీ ప్రత్యేకం. మార్షల్ ఆర్ట్స్ తో పాటు తనలో నటుడిని పవన్ ఆవిష్కరించిన తీరు కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యే రిజల్ట్ ఇచ్చింది. ఈవీవీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా పవన్ తో పాటు అక్కినేని కుటుంబానికి చెందిన సుప్రియను హీరోయిన్ గా పరిచయం చేసారు. తర్వాత తనకు సినిమాల మీద పెద్దగా ఆసక్తి లేకపోవడంతో అన్నపూర్ణ సంస్థకు సంబందించిన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించడం మొదలు పెట్టారు. తెరవెనుక ఉన్న సుప్రియ చాలా అరుదుగా మాత్రమే బయటికి వస్తారు.. ఇన్నాళ్లకు అడవి శేష్ గూఢచారిలో ఒక కీలకమైన పాత్ర ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సుప్రియ ఇకమీదట కంటిన్యూ చేస్తారో లేదో కానీ దీని మీద చాలా ఆసక్తి నెలకొంది.

స్టార్ హీరోల ఫామిలీల నుంచి వచ్చిన అమ్మాయిలు హీరోయిన్ గా నిలదొక్కుకోవడం కష్టం. కృష్ణ గారి అమ్మాయి మంజుల అభిమానుల కోరిక మన్నించి షో తర్వాత ఒకటి రెండు తప్ప ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు.మెగా ఫామిలీ నీహారిక పరిస్థితి అంతే. కొన్ని పరిమితుల మధ్యే పాత్రలు ఎంచుకోవాల్సి పరిస్థితి. బాలయ్య తన బిడ్డలను పరిచయం చేసే ఆలోచన కూడా చేయకుండా గ్లామర్ ప్రపంచానికి దూరంగా పంపించేశారు. అందుకే సుప్రియ కూడా నటన కంటే నిర్మాణం వైపు మొగ్గు చూపి ఇన్నాళ్లకు గూఢచారి ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడంతో కొత్త కోడలు సమంత తో పాటు సుమంత్ సోషల్ మీడియా ద్వారా మెసేజులు పెట్టడం ఆసక్తి రేపుతోంది. అఖిల్ తో పాటు నాగార్జున సైతం ట్రైలర్ ను షేర్ చేసుకున్నారు. హీరో అడవి శేష్ కు ఇదంతా భలే ప్లస్ అవుతోంది. ప్రమోషన్ ఈ రకంగా కూడా జరుగుతుండటంతో అక్కినేని ఫాన్స్ సపోర్ట్ దొరుకుంటుందనే ఆనందంలో ఉన్నాడు. ఆగస్ట్ 3న విడుదల కానున్న గూఢచారి మీద భారీగా లేవు కానీ ట్రైలర్ విడుదల అయ్యాక మాత్రం హైప్ పెరిగిపోయింది.