Begin typing your search above and press return to search.
సినీ నటిని వేధించిన సినిమాటోగ్రాఫర్ కు సుప్రీం నోటీసులు
By: Tupaki Desk | 3 March 2021 6:00 PM ISTసినీ నటి శ్రీసుధను వేధించిన కేసులో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడుకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శ్యామ్ కే నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో శ్రీసుధ కేసు వేసింది.నెలరోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని శ్యామ్ కే నాయుడును సుప్రీంకోర్టు ఆదేశించింది.
పెళ్లి పేరుతో తనని మోసం చేశాడని.. శ్యామ్ కే నాయుడుపై గతంలో సినీ నటి శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంప్రమైజ్ అయినట్లు నకిలీ డాక్యుమెంట్లు , చెక్కులు, డీడీలు రూపంలో 50 లక్షలు ఇచ్చినట్లు శ్యామ్ కే నాయుడు కోర్టుకు సమర్పించారు. డాక్యుమెంట్లు చూసి శ్యామ్ కే నాయుడుకు నాంపల్లి సెషన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అయితే బెయిల్ రద్దు చేయాలంటూ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో శ్రీసుధ కేసు వేసింది. సుప్రీంలో తనను చంపేందుకు కుట్ర చేశారని.. విజయవాడలో కారు యాక్సిడెంట్ చేశారంటూ కోర్టుకు శ్రీసుధ తెలిపింది.
ఈ కేసులో శ్యామ్ కే నాయుడుతోపాటు ఆయన సోదరుడు చోటా కే నాయుడు కూడా బెదిరింపులకు దిగుతున్నట్లు శ్రీసుధ ఆరోపిస్తోంది.ఈ కేసులో తాజాగా విచారణ జరిగి శ్యామ్ కే నాయుడుకు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నెలరోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.