Begin typing your search above and press return to search.

మెగా మేనల్లడు.. సూర్యతో తప్పదట

By:  Tupaki Desk   |   19 April 2016 5:00 PM IST
మెగా మేనల్లడు.. సూర్యతో తప్పదట
X
ఒకవేళ ''బ్రహ్మోత్సవం'' టాక్‌ యావరేజ్‌ గా వస్తే.. మే 24న మన సినిమాను రిలీజ్‌ చేద్దాం అంటూ మెగా మేనల్లుడి ''సుప్రీమ్‌'' గురించి దిల్‌ రాజు మొన్నటివరకు చెప్పారట. అయితే అదంతా ఇప్పుడు పాత మాట. ఎందుకంటే అసలు మే 6న సూర్య సినిమా ఒక క్లాస్‌ ఫిలిం కాబట్టి.. ఆరోజే తన మాస్‌ ట్రీట్‌ ను జనాలకు అందిస్తే బెటర్‌ అని ఇప్పుడు రాజు గారు ఫీలవుతున్నారట.

అవును.. మే 6 అనేదే ఒక మంచి అనువైన డేట్‌. బ్రహ్మోత్సవం ఒకవేళ 13కు వచ్చేస్తే.. హ్యాపీగా వారం టైమ్‌ ఉంటుంది కలెక్షన్లు కుమ్ముకోవడానికి. ఒకవేళ బ్రహ్మోత్సవం ఒక వారం పోస్టుపోన్‌ అయితే.. రెండు వారాలు కుమ్మేసుకోవచ్చు. పైగా సూర్య సినిమా 24 లో ఉన్న కంటెంట్‌.. సాయిధరమ్‌ తేజ్‌ సినిమాలో ఉన్న కంటెంట్‌ కు అస్సలు పోలికే లేదు. సో.. ఈ రెండు సినిమాలకు పెద్దగా పోటీ కూడా ఉండదు. దేని ఆడియన్స్‌ దానికే ఉంటారు. అందులోనూ ధియేటర్స్ ను పోగేయడం ఈయనకు పెద్ద ఇబ్బంది కానే కాదు. సో.. సుప్రీమ్‌ మే 6 ఫిక్సయ్యే ఛాన్సుందని తెలుస్తోంది.

సూర్యతో క్లాష్‌ తప్పనప్పుడు.. మరి ఇప్పటికే సూర్య టైపులో ప్రమోషన్‌ కూడా మొదలెట్టాలిగా రాజు గారూ?? అదే విషయంపై ప్రస్తుతం ఒక ఫైనల్‌ చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసి.. ఈ శుక్రవారం సరైనోడు రిలీజయ్యాక.. సుప్రీమ్‌ ప్రమోషన్లు మొదలుపెడతారట.