Begin typing your search above and press return to search.

ఓటిటి రిలీజ్ దిశగా సుప్రీమ్ హీరో మూవీ..??

By:  Tupaki Desk   |   3 Jun 2021 3:30 AM GMT
ఓటిటి రిలీజ్ దిశగా సుప్రీమ్ హీరో మూవీ..??
X
టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్.. ఇటీవలే సినిమాల జోరు పెంచాడు. 'సోలో బ్రతుకే సో బెటర్' హిట్ తర్వాత తేజ్ నటించిన కొత్త సినిమా 'రిపబ్లిక్'. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి. భారీ గ్యాప్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ దేవాకట్టా నుండి సినిమా రాబోతుండటంతో ఇండస్ట్రీ రిపబ్లిక్ విషయంలో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఎందుకంటే దేవాకట్టా ఓ రచయితగా.. దర్శకుడుగా ఆల్రెడీ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

సినిమాలను సినిమాలుగా కాకుండా ఆలోచనాత్మకంగా తెరకెక్కించడంలో దేవాకట్టా చాలా సిద్ధహస్తుడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పలువురు టాలీవుడ్ మేకర్స్ కూడా ఇంటర్వ్యూలలో మాట్లాడారు. ఇదిలా ఉండగా.. రిపబ్లిక్ సినిమా గురించి కొత్తగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటీవలే సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా.. మా సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. కేవలం 64 రోజుల్లో ఎలాంటి కరోనా కేసులు లేకుండా పూర్తి చేయడం ఆనందంగా ఉందని చెప్పాడు డైరెక్టర్. కానీ సినిమా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.

ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుండగా.. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలకపాత్రలలో కనిపించనున్నారు. తాజాగా రిపబ్లిక్ మూవీ గురించి ఇండస్ట్రీ వర్గాలలో పలు పుకార్లు వైరల్ అవుతున్నాయి. మరి విషయం ఏంటంటే.. రిపబ్లిక్ సినిమాను ఓటిటి రిలీజ్ చేసే దిశగా మేకర్స్ ఆలోచన చేస్తున్నారని టాక్ బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే మేకర్స్ జీ గ్రూప్ వారితో చర్చలు జరుపుతున్నారని.. త్వరలోనే కన్ఫర్మేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అందులోను సినిమాను 'పే పర్ వ్యూ' పద్ధతిలో రిలీజ్ చేయనున్నట్లు బజ్ క్రియేట్ అయింది. కానీ ఇంతవరకు మేకర్స్ నుండి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. మరి త్వరలోనే ఈ పుకార్లపై స్పందిస్తారా లేక కన్ఫర్మ్ చేస్తారా అనేది చూడాలి.