Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్స్ పొంగల్‌ క్లాష్‌ తప్పదేమో!

By:  Tupaki Desk   |   30 Aug 2022 4:14 AM GMT
సూపర్‌ స్టార్స్ పొంగల్‌ క్లాష్‌ తప్పదేమో!
X
సంక్రాంతి సినిమాలకు అతి పెద్ద సీజన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశవ్యాప్తంగా కూడా సంక్రాంతి అనేది సినిమాలకు మంచి బిజినెస్ సమయం. తెలుగు తో పాటు తమిళనాడులో సంక్రాంతి రేసులో సినిమాలు నెలల ముందే ఫిక్స్ అవుతూ ఉంటాయి. టాలీవుడ్‌ లో ఇప్పటికే రెండు మూడు భారీ సినిమాలు సంక్రాంతి బరిలో నిలువబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఇప్పుడు తమిళనాట కూడా ఒక భారీ క్లాష్ పొంగల్ కి తప్పక పోవచ్చు అంటూ అక్కడ సినీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు చర్చించుకుంటున్నారు. తెలుగు లో మాదిరిగానే అక్కడ పొంగల్ కోసం స్టార్ హీరోలు సూపర్‌ స్టార్‌ హీరోలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు హీరోలు పొంగల్ రేసులో నిలువబోతున్నట్లుగా అనధికారికంగా క్లారిటీ ఇచ్చారు.

ఆ ఇద్దరు హీరోలు విజయ్‌ మరియు అజిత్ కుమార్‌. ఈ ఇద్దరు సూపర్‌ స్టార్స్‌ పొంగల్‌ సందర్భంగా ఒకే వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విజయ్‌ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు నిర్మాత దిల్‌ రాజు నిర్మాణం లో వారసుడు అనే మల్టీ లాంగ్వేజ్ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. వచ్చే పొంగల్ కి విడుదల చేయాలని భావిస్తున్నారు.

దిల్‌ రాజు కు గతంలో సంక్రాంతి సందర్భంగా వచ్చిన సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా అక్కడ ఇక్కడ మంచి విజయాన్ని నమోదు చేస్తుందని దిల్ రాజు భావిస్తున్నాడు.ఇక ఇప్పటికే హెచ్ వినోద్‌ దర్శకత్వంలో రెండు సినిమాలు చేసి మంచి విజయాలను సొంతం చేసుకున్న అజిత్‌ వరుసగా మూడవ సినిమాను ఆయన దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్దకు పొంగల్ సందర్భంగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ ఇద్దరు కూడా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి స్టార్‌ డమ్‌ ను దక్కించుకున్నారు. అలాంటి వీరిద్దరు సంక్రాంతికి తెలుగు బాక్సాఫీస్ వద్ద తెలుగు స్టార్‌ హీరోలతో కూడా ఢీ కొట్టాల్సిన పరిస్థితి. కనుక పొంగల్ కి అక్కడ ఇక్కడ బిగ్ క్లాష్‌ తప్పక పోవచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.