Begin typing your search above and press return to search.

మేజ‌ర్ కోసం బ‌రిలో దిగుతున్న సూపర్ స్టార్లు‌

By:  Tupaki Desk   |   11 April 2021 7:32 AM GMT
మేజ‌ర్ కోసం బ‌రిలో దిగుతున్న సూపర్ స్టార్లు‌
X
అడివి శేష్ న‌టిస్తున్న‌ మేజర్ టీజర్ ఈ సోమ‌వారం(ఏప్రిల్ 12) సాయంత్రం 4:05 గంటలకు లాంచ్ అవుతోంది. ముగ్గురు సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్- మహేష్ బాబు- పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ టీజర్ ‌ను వరుసగా హిందీ- తెలుగు- మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవ‌న‌ ప్రయాణాన్ని మేజ‌ర్ లో ఆవిష్క‌రిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అతని ధైర్యం త్యాగాన్ని ఉద్విగ్నభ‌రితంగా తెర‌పై చూపించ‌నున్నారు. ఈ టీజర్ మేజర్ జీవితంలోని వివిధ దశలను ఆవిష్క‌రించ‌నుంద‌ని తెలుస్తోంది.

స‌‌యీ మంజ్రేకర్- శోభితా ధూలిపాళ‌- ప్రకాష్ రాజ్- రేవతి- మురళి శర్మ ఇందులో ప్ర‌ధాన తారాగ‌ణం. శ‌శికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా.. మహేష్ బాబు GMB ఎంటర్ టైన్మెంట్ - A + S సినిమాస్ సహకారంతో నిర్మిస్తోంది.

సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత‌క‌థాంశానికి అటు హిందీ మ‌ల‌యాళంలోనూ ప్రాముఖ్య‌త ఉన్న దృష్ట్యా ఆ రెండు భాష‌ల్లోనూ అత్యంత భారీగా రిలీజ్ కానుంది. గూఢ‌చారి- ఎవ‌రు- క్ష‌ణం లాంటి హిట్ చిత్రాల్లో న‌టించిన అడివి శేష్ కి తెలుగులో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. మేజ‌ర్ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ గా రిలీజ్ కానుంది.