Begin typing your search above and press return to search.

కన్నతల్లికి సూపర్ స్టార్ శుభాకాంక్షలు!

By:  Tupaki Desk   |   20 April 2021 6:30 AM GMT
కన్నతల్లికి సూపర్ స్టార్ శుభాకాంక్షలు!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఏప్రిల్ 20వ తేదీ చాలా విలువైనది. ఎందుకంటే ఏప్రిల్ 20న.. అంటే ఈరోజు తన తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు. కన్నతల్లి పుట్టినరోజు సందర్భంగా మహేష్ తన తల్లితో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అంతేగాక 'హ్యాపీ బర్త్ డే అమ్మ.. ప్రతిరోజూ మీకు గొప్పగా ఉండాలి' అని కోరుకుంటూ అపురూపమైన తన తల్లి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఏప్రిల్ 20వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటోంది. తల్లికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ రోజు నా జీవితంలో కూడా గొప్పరోజు అంటూ ఇదివరకే తెలిపాడు. ఇందిరాదేవి గారికి సూపర్ స్టార్ కృష్ణతో 1961లో పెళ్లైంది.

ఇందిరాదేవి కృష్ణకు మేనమరదలు అవుతుందట. నిజానికి మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి బయట చాలా అరుదుగా కనిపిస్తుంటారు. మహేష్ బాబు సినిమాలకు సంబంధించి ఫంక్షన్లలో కూడా పెద్దగా కనిపించరు. తండ్రి కృష్ణ, విజయనిర్మల, మహేష్ బాబు బ్రదర్స్ సిస్టర్స్ కనిపిస్తారు. కానీ తల్లి ఇందిరాదేవి కనిపించిన సందర్భాలు లేవు. అయితే సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరాదేవిలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేశ్ బాబు కొన్ని సినిమాల్లో నటించి ఇండస్ట్రీ నుండి దూరంగా ఉంటున్నారు. చిన్నకొడుకైన మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ గా, అగ్ర హీరోలలో ఒకరిగా రాణిస్తున్నాడు. అయితే మహేష్ తో పాటు ఆయన భార్య నమ్రత శిరోద్కర్ కూడా ఇందిరాదేవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తుంది.