Begin typing your search above and press return to search.

షాక్‌ : సూపర్‌ స్టార్‌ వైఫ్‌ వాడేది బేసిక్‌ ఫోన్‌

By:  Tupaki Desk   |   26 Feb 2019 10:43 AM GMT
షాక్‌ : సూపర్‌ స్టార్‌ వైఫ్‌ వాడేది బేసిక్‌ ఫోన్‌
X
తమిళ స్టార్‌ హీరో అజిత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తమిళనాట మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఈయనకు మంచి క్రేజ్‌ ఉంది. సింప్లిసిటీకి మారు పేరు అన్నట్లుగా కనిపించే అజిత్‌ ప్రతి సారి కూడా తనదైన శైలిలో విభిన్నంగా జనాల్లో వార్తాంశంగా ఉంటాడు తాజాగా మరోసారి అజిత్‌ సింప్లిసిటీ బయట పడింది. ఈసారి అజిత్‌ భార్య గురించిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అజిత్‌ భార్య షాలిని ఒక సింపుల్‌ ఫోన్‌ పట్టుకుని కనిపించింది.

మారిన టెక్నాలజీ నేపథ్యంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ లు ఉంటున్నాయి. కాని స్టార్‌ హీరో అజిత్‌ భార్య షాలిని మాత్రం నోకియా బేసిక్‌ మోడల్‌ ఫోన్‌ ను వాడటం జరుగుతుంది. 3200 రూపాయల విలువ చేసే నోకియా 3310 మోడల్‌ ఫోన్‌ ను ఆమె వాడుతున్న నేపథ్యంలో అంతా కూడా అవాక్కవుతున్నారు. ఒక స్టార్‌ హీరో భార్య ఇలాంటి ఫోన్‌ వాడటం ఏంటని అవాక్కవుతున్నారు. సాదారణంగా చదువు రాని వారు మాత్రమే ఇలాంటి ఫోన్స్‌ ను వాడుతున్నారు. కాని షాలిని ఈ ఫోన్‌ ను వాడటం ఇప్పుడు వైరల్‌ అయ్యింది.

షాలినితో పాటు అజిత్‌ కూడా చాలా సింపుల్‌ జీవితాన్ని గడుపుతారని మరో సారి నిరూపితం అయ్యింది. తన సినిమాల ద్వారా వందల కోట్ల వసూళ్లను సాధించే అజిత్‌ భారీగా పారితోషికం కూడా తీసుకుంటాడు. అలాంటి అజిత్‌ కు ఐఫోన్‌ కొనడం కూడా పెద్ద సమస్య కాదు, కాని సింప్లిసిటీగా ఉండాలనే ఒకే ఒక్క ఉద్దేశ్యంతో ఇలాంటి ఫోన్‌ ను వాడుతున్నారని అనుకోవచ్చు. అజిత్‌ వాడుతున్న ఫోన్‌ కూడా మామూలు ఫోన్‌ అయ్యి ఉంటుంది.