Begin typing your search above and press return to search.

ఆ న్యూస్ నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కి పండగే...!

By:  Tupaki Desk   |   18 July 2020 10:30 AM IST
ఆ న్యూస్ నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కి పండగే...!
X
'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమా 'సర్కారు వారి పాట' ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న 'సర్కారు వారి పాట' పై అటు మహేష్ ఫ్యాన్స్ లోనూ ఇటు సినీ అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టే అనౌన్స్మెంట్ పోస్టర్ లో చెవికి రింగు.. రఫ్ గా కనిపించేలా గడ్డం.. మెడ మీద రూపాయి కాయిన్ టాటూతో మాసీ లుక్ లో అదరగొట్టాడు మహేష్. ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో ఈ సినిమాకి సంభందించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

కాగా మహేష్ బాబు 'సర్కారు వారి పాట'లో డ్యూయల్ రోల్ ప్లే చేయబోతున్నాడట. మహేష్ భిన్నమైన అభిప్రాయాలు కలిగిన కవలలుగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. మహేష్ బాలనటుడిగా తన తండ్రి కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'కొడుకు దిద్దిన కాపురం' సినిమాలో ద్విపాత్రాభినయం చేసాడు. ఆ తర్వాత ఎస్.జే.సూర్య దర్శకత్వంలో వచ్చిన 'నాని' క్లైమాక్స్ సీన్ లో తండ్రి కొడుకులుగా కనిపించి కాసేపు అభిమానులను ఆనంద పరిచాడు. అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయి డ్యూయల్ రోల్ లో నటించే సాహసం మహేష్ చేయలేదనే చెప్పాలి. కెరీర్ స్టార్టింగ్ నుండి ఎన్నో ప్రయోగాలు చేసిన మహేష్ ద్విపాత్రిభినయం మాత్రం చేయలేదు. ఇప్పుడు 'సర్కారు వారి పాట' కోసం ఆ సాహసం చేస్తే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా 'మహానటి' కీర్తి సురేష్ ని హీరోయిన్ గా నటించనుంది. కరోనా తీవ్రత తగ్గితే 'సర్కారు వారి పాట' మూవీ షూటింగ్ సెప్టెంబర్ లో స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.