Begin typing your search above and press return to search.

డ్రగ్స్‌ కేసులో మీడియాకు సూపర్‌ స్టార్‌ సూచన

By:  Tupaki Desk   |   4 Oct 2020 1:40 PM IST
డ్రగ్స్‌ కేసులో మీడియాకు సూపర్‌ స్టార్‌ సూచన
X
బాలీవుడ్‌ లో 90 శాతం మంది డ్రగ్స్‌ కు బానిసలే అంటూ ఇటీవల కాలంలో మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ సెలబ్రెటీ పార్టీ అంటే ఖచ్చితంగా డ్రగ్స్‌ ఉంటాయంటూ మీడియాలో ప్రముఖులు అంటున్నారు. ఈ సమయంలో కొందరు బాలీవుడ్‌ ప్రముఖుల మీడియాలో కథనాలను తప్పుబడుతున్నారు. ఎవరో ఏదో అన్నారని దాన్నే ప్రామాణికంగా తీసుకుని కథనాలు ప్రసారం చేయడం ఏమాత్రం సరి కాదు. బాలీవుడ్‌ లో డ్రగ్స్‌ రాకెట్‌ ఉన్న వాస్తవమే అయినా కూడా బాలీవుడ్‌ మొత్తం కూడా చెడిపోయిందని.. డ్రగ్స్‌ అంటే బాలీవుడ్‌ అన్నట్లుగా చూడవద్దంటూ మీడియాకు మరియు జనాలకు విజ్ఞప్తి చేసింది.

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హీరో.. ప్రస్తుతం నెం.1 హీరోగా కొనసాగుతున్న అక్షయ్‌ కుమార్‌ డ్రగ్స్‌ కేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్‌ లో డ్రగ్స్‌ ఉన్న మాట వాస్తవమే. కాని ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్‌ ను వాడుతున్నారు అనడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు. డ్రగ్స్‌ కేసు చాలా సున్నితమైన విషయం. దీనిపై ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడటం సరి కాదు. డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ కు చెందిన వారు ఉంటారు. కాని మొత్తం బాలీవుడ్‌ ను డ్రగ్స్‌ కు బానిస అంటూ మీడియాలో కథనాలు ప్రచారం చేయడం సరైనది కాదంటూ అక్షయ్‌ కుమార్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాస్త సున్నితంగా మీడియా వారు ఈ విషయాన్ని డీల్‌ చేస్తే మంచిదంటూ సూచించాడు.