Begin typing your search above and press return to search.
'మహేష్'తో రాజమౌళి హిస్టారికల్ మూవీనా?
By: Tupaki Desk | 5 May 2020 1:40 PM ISTతెలుగు సినీ ఇండస్ట్రీ లో ఓ వార్త సంచలనం అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన నెక్స్ట్ మూవీ ఉండబోతోందని దర్శక ధీరుడు రాజమౌళి ప్రకటించారు. అయితే జక్కన్న తీయబోయే ప్రాజెక్ట్ పై ఇప్పటినుంచే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ కాంబినేషన్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ చాలా ఖుషీగా ఉన్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమా తెరకెక్కబోతుంది..? అన్నది ఇప్పుడు ఫిలింనగర్‌లో చర్చ నడుస్తుంది. మహేష్‌తో రాజమౌళి జేమ్స్ బాండ్ తరహా సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరి కాంబోలో మూవీకి సంబంధించి మరో వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. సూపర్‌స్టార్‌తో జక్కన్న చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి కథను సిద్ధం చేయమని.. ఇప్పటికే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కి రాజమౌళి చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఇంతవరకు మహేష్.. ఒక్క చారిత్రాత్మక చిత్రంలో నటించలేదు.
ఇక ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మహేష్ తన మనసులో మాట వెల్లడించాడు. రాజమౌళి లాంటి దర్శకుడు ఉంటే చారిత్రాత్మక సినిమాలో నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని. లేకపోతే అలాంటి కథల్లో నటించేందుకు కాస్త ఆలోచిస్తానని తెలిపారు. ఈ క్రమంలో జక్కన్న కూడా మహేష్ కోసం చారిత్రాత్మక చిత్రాన్ని ప్లాన్ చేసినట్లు సమాచారం. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ కోసం ఏ కథ సిద్ధమవుతుందో, దానికి ఏం టైటిల్ పెడతారోనని ఇటు మహేష్ ఫ్యాన్స్, రాజమౌళి సన్నిహితులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ పరుశురాం దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. పరశురామ్ తో సినిమా అయ్యాక రాజమౌళి చిత్రం ప్రారంభం కానుంది. ఆర్ఆర్ఆర్ మూవీ పూర్తయితే గానీ రాజమౌళి ఈ మూవీపై ఫోకస్ పెట్టే అవకాశం ఉందట. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ జనవరిలో విడుదల కానుందని రాజమౌళి టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే..