Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ ఒక్కడే రిపీట్

By:  Tupaki Desk   |   15 Nov 2019 6:56 AM GMT
సూపర్ స్టార్ ఒక్కడే రిపీట్
X
టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ చాలా మంది హీరోలకి ఫేవరేట్. పెద్ద పండగ కావడంతో సినిమా కలెక్షన్స్ ఓ రేంజ్ ఉంటాయి. సినిమా యావరేజ్ టాక్ అందుకున్నా సంక్రాంతి సీజన్ లో కలెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకే ఓ మూడేళ్ళుగా బాలయ్య కచ్చితంగా సంక్రాంతికి ఓ సినిమాను రిలీజ్ చేస్తూ వచ్చాడు. ఈ ఏడాది కూడా 'ఎన్టీఆర్ కథానాయకుడు' తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఆ సినిమా అనుకొని విధంగా డిజాస్టర్ అయింది.

అందుకే ఈసారి సంక్రాంతి సెంటిమెంట్ ని లైట్ తీసుకొని 'రూలర్' సినిమాతో ఒక నెల ముందే అంటే డిసెంబర్ లోనే థియేటర్స్ లోకొచ్చేస్తున్నాడు. ఇక మహేష్ '1నేనొక్కడినే' తర్వాత సంక్రాంతికి రావడం ఇదే. బన్నీ సినిమా కూడా సంక్రాంతికొచ్చి చాలా ఏళ్ళయింది. ఇక రజినీ ఒక్కడే ఈ సంక్రాంతి కూడా తన సినిమాను రెడీ చేసి వదులుతున్నాడు.

ఈ ఏడాది 'పేట'తో సంక్రాంతి బరిలో నిలిచిన సూపర్ స్టార్ ఇప్పుడు 'దర్బార్' తో మళ్ళీ వచ్చే సంక్రాంతి పోటీలో నిలిచాడు. మరి 'పేట'తో ఓ మాదిరి కలెక్షన్స్ రాబట్టి పరవాలేదనిపించుకున్న రజినీ ఈ సారి మహేష్ , బన్నీ సినిమాలతో పోటీ పడి ఏ మేరకు కలెక్షన్స్ రాబడతాడో..? చూడాలి.