Begin typing your search above and press return to search.

సినీ కెరీర్ కొన‌సాగింపుపై ర‌జ‌నీ కీల‌క వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   28 May 2021 3:00 PM IST
సినీ కెరీర్ కొన‌సాగింపుపై ర‌జ‌నీ కీల‌క వ్యాఖ్య‌లు
X
''ర‌జ‌నీకాంత్‌..'' ఈ పేరుకున్న వైబ్రేష‌న్స్ ఏంటో ఆయ‌న ఫ్యాన్స్ ను అడిగితే చెబుతారు. కోలీవుడ్ నుంచి ఖండాత‌రాలకు విస్త‌రించిన త‌లైవా స్టైల్.. అభిమానుల‌తోపాటు సాధార‌ణ ప్రేక్ష‌కుల‌ను సైతం మెస్మ‌రైజ్ చేస్తుంది. అందుకే.. ఒంటి మీద‌కు 70 ఏళ్లు వ‌చ్చినా.. ర‌జ‌నీ త‌మ‌ను ఎంట‌ర్ టైన్ చేయాల‌నే కోరుకుంటారు ఫ్యాన్స్‌.

అయితే.. హెల్త్ మెయింటెనెన్స్ ఎంత‌గా చూసుకున్నా ఏడు ప‌దుల వ‌య‌సు అనేది త‌క్కువ కాదు. ఈ వ‌య‌సులో వ‌చ్చే స‌మ‌స్య‌లు సాధార‌ణంగా వ‌స్తూనే ఉంటాయి. వాటి తీవ్ర‌త ఎంత‌న్న‌ది త‌ర‌చూ చూస్తున్న‌దే. ఆ మ‌ధ్య సింగ‌పూర్ లో వైద్యం చేయించుకున్న త‌లైవా చాలా రోజులు అక్క‌డే ఉన్నారు.

ఇటీవ‌ల హైద‌రాబాద్ లో షూటింగ్ సంద‌ర్భంగా తీవ్ర అనారోగ్యానికి గురైన సంగ‌తి కూడా తెలిసిందే. చాలా కాలం రెస్ట్ తీసుకున్న త‌ర్వాత‌.. తిరిగి ''అన్నాత్తే'' షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ మ‌ధ్య‌నే షూట్ కంప్లీట్ అయిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లో వైద్య ప‌రీక్ష‌లు అమెరికా వెళ్ల‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ సంద‌ర్భంగా సినీ కెరీర్ కొన‌సాగింపుపై ర‌జ‌నీ త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను వెల్ల‌డించారట‌. వ‌య‌సుకు, మ‌న‌సుకు సంబంధం లేదు కాబ‌ట్టి.. త‌న‌కు ఇంకా సినిమాల్లో న‌టించాల‌నే కోరిక ఉన్న‌ట్టు చెప్పారట‌ ర‌జ‌నీ. ఈ విష‌యాన్ని అన్నాత్తే చిత్ర యూనిట్ తెలిపింది. ఇంకా కొన్నాళ్లు తాను సినిమాల్లో న‌టించాల‌ని త‌లైవా అనుకుంటున్న‌ట్టు వెల్ల‌డించింది.

అయితే.. ఆరోగ్యం ఎంత మేర స‌హ‌క‌రిస్తుంది? అనే విష‌యం భ‌గ‌వంతుడు ఇచ్చే శ‌క్తిపైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ర‌జ‌నీ చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో.. ర‌జనీ మ‌రికొన్నాళ్లు అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేస్తార‌నే విష‌యం తేలిపోయింది. అన్నాతే చిత్రాన్ని వ‌చ్చే దీపావ‌ళికి రిలీజ్ చేయ‌బోతున్నారు.