Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : అప్పట్లో బ్యాట్‌ పట్టిన సూపర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   19 Jun 2020 4:30 AM GMT
ఫొటోటాక్‌ : అప్పట్లో బ్యాట్‌ పట్టిన సూపర్‌ స్టార్‌
X
స్టార్‌ హీరోల.. సెలబ్రెటీల పాత ఫొటోలు ముఖ్యంగా చిన్నప్పటి ఫొటోలు చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. స్టార్స్‌ కు చెందిన చిన్నప్పటి ఫొటోలు అన్ని కూడా నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం నెట్టింట మహేష్‌ బాబు చిన్నప్పటి ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్‌ ఈ ఫొటోలను తెగ షేర్‌ చేస్తున్నాడు. సాదారణంగానే మహేష్‌ బాబు చిన్నప్పటి ఫొటోలు ఎప్పుడు బయటకు వచ్చినా ట్రెండ్‌ అవుతూ ఉంటాయి. ఈసారి స్పెషల్‌ గా మహేష్‌ బాబు బ్యాట్‌ పట్టుకుని ఉన్న ఫొటో బయటకు రావడం మరింత మంది దృష్టిని ఆకర్షిస్తోంది.

మహేష్‌ బాబు బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించాడు. ఆ సమయంలోనే సరదాగా క్రికెట్‌ కూడా ఆడేవాడు. అప్పటి ఫొటో ఇది. మహేష్‌ బాబు బ్యాట్‌ పట్టుకుని షాట్‌ కోసం ట్రై చేస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటోను నెటిజన్స్‌ షేర్‌ చేస్తున్నారు. మహేష్‌ బాబు ఏదైనా క్రికెటర్‌ బయోపిక్‌ చేస్తే బాగుంటుంది కదా అంటూ అప్పుడే ఫ్యాన్స్‌ కోరికలు కోరుతున్నారు. హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి పలు పాత్రలు పోషించిన మహేష్‌ బాబు క్రికెటర్‌ గా మాత్రం నటించలేదు. కాని చిన్నప్పుడే ఇలా బ్యాట్‌ పట్టి క్రికెట్‌ ఆడాడు.

ప్రస్తుతం మహేష్‌ బాబు తన 27వ చిత్రానికి రెడీ అవుతున్నాడు. పరశురామ్‌ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రం రూపొందబోతుంది. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నుండి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. 14 రీల్స్‌ మరియు మైత్రి మూవీ మేకర్స్‌ తో కలిసి మహేష్‌ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌ గా కీర్తి సురేష్‌ నటిస్తున్నట్లుగా ఇటీవలే క్లారిటీ వచ్చింది. సర్కారు వారి పాట వచ్చే ఏడాది సమ్మర్‌ లో లేదంటే దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.